Ram Charan | రామ్ చరణ్ బర్త్ డే…నగదు బహుమతిని విరాళంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్న చిరు
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 41వ పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. అదే సమయంలో ఆయన నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ గ్లింప్స్‌లో చరణ్ కండలు తిరిగిన శరీరంతో కుస్తీ వీరుడిగా కనిపించడం విశేషం. ఇంతకాలం క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని భావించిన ఈ సినిమా, ఇప్పుడు మల్లయోధుడి కథతో కొత్త కోణాన్ని చూపించడంతో మూవీపై భారీ హైప్ ఏర్పడింది.
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. చిన్నతనంలో తన చేయి పట్టుకుని నడిచిన చరణ్, నేడు లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచాడని గర్వంగా పేర్కొన్నారు. కుటుంబ విలువలు, క్రమశిక్షణ, దైవభక్తి వంటి లక్షణాలు చరణ్‌ను మరింత గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాయని కొనియాడారు. అంతేకాదు చరణ్ బర్త్‌డేను మెగాస్టార్ చిరంజీవి ఎంతో అర్థవంతంగా జరిపారు. ఎన్టీఆర్ అవార్డు ద్వారా వచ్చిన రూ.10 లక్షల నగదు బహుమతిని వివిధ ఫౌండేషన్స్కి దానం చేస్తూ తన సేవా మనసును మరోసారి చాటుకున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థను సందర్శించి అక్కడ ఉన్న వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా ఆహారం వడ్డించి, దుస్తులు పంపిణీ చేశారు.
ఓ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌ని వృద్ధులు కలవగా, వారిని ఈ రోజు తన బ్లండ్ బ్యాంక్‌కి ఆహ్వానించి వారికి కొత్త బట్టలు పెట్టి స్వయంగా వడ్డించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇదిలా ఉంటే చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన ప్రత్యేక శైలిలో సరదాగా ట్వీట్ చేస్తూ “ఈ ఏడాది ‘పెద్ది’ నామ సంవత్సరంగా మారాలి” అంటూ విషెస్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా కూడా తమ కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలిపారు. చరణ్ సోదరి సుస్మిత కొణిదెల చరణ్‌ను కుటుంబానికి వెన్నెముకగా అభివర్ణించడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

