Chandramukhi-2 Movie | అసలు ట్వీస్ట్ను ముందే చెప్పేశారేంటి.. ఇప్పుడు చంద్రముఖి అలా వస్తుందా?
Chandramukhi-2 Movie | ట్రెండ్ సెట్టర్ చంద్రముఖి సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకున్న ఒక వైబ్‌లోకి వెళ్లిపోతుంటాం. అంతలా వెన్నులో వణుకు పుట్టించిన సినిమాకు సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Chandramukhi-2 Movie | ట్రెండ్ సెట్టర్ చంద్రముఖి సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకున్న ఒక వైబ్‌లోకి వెళ్లిపోతుంటాం. అంతలా వెన్నులో వణుకు పుట్టించిన సినిమాకు సీక్వెల్ వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే చంద్రముఖి సీక్వెల్ మాత్రం జనాల్లో హైప్ క్రియేట్ చేయడంలో విఫలం అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి మొన్న రిలీజైన ట్రైలర్ వరకు ప్రతీది ట్రోలర్ రాయుళ్ల కోసమే అన్న విధంగా మారిపోయింది. అయితే రీసెంట్గా రిలీజైన సెకండ్ ట్రైలర్ మాత్రం జనాల్లో కాస్త అంచనాలు క్రియేట్ చేసింది. అయితే స్కంద, పెదకాపు సినిమాలు పోటీలను తట్టుకోవాలంటే ఆ హైప్ చాలదు. మిగిలున్న నాలుగు రోజుల్లోనే వీలైనన్ని ప్రమోషన్లు చేసి జనాల్లోకి తీసుకెళ్లాలి.
ఇక ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతుంది. కాగా శనివారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన పలు విషయాలను మేకర్స్ పంచుకున్నారు. అయితే తొలిపార్టులో జ్యోతికను చంద్రముఖి ఆత్మ ఆవహించగా.. సెకండ్ పార్ట్‌లో స్వయంగా చంద్రముఖి రానుందని చెప్పేశారు. దాంతో అసలు ట్విస్ట్ ముందే రివీలైపోయింది. ఇక కనిపించని దెయ్యంగానే వెన్నులో వణుకు పుట్టిస్తే.. ఇప్పుడేకంగా చంద్రముఖే వస్తే ఇంకా ఏ రేంజ్లో భయపెడుతుందో అనే పరిణామాల నేపథ్యంలో కథ కొనసాగుతుంది.
లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాకు వాసు.పి దర్శకుడు. కాగా గతంలోనే నాగవల్లి అంటూ వెంకీతో చంద్రముఖి సీక్వెల్ అదేనని విడుదల చేయగా.. అది పెద్దగా ఆడలేదు. ఇక ఇప్పుడు ఇదే అసలైన సీక్వెల్ అంటే చంద్రముఖి-2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటివరకైతే ఆహా ఓహా అన్న రేంజ్లో అంచనాల్లేవు కానీ.. హార్రర్ జోనర్ కాబట్టి జనాలకు కాస్త కనెక్ట్ అయినా బంపర్ హిట్టవడం పక్కా. ఇక ఈ సీక్వెల్ సినిమా సెప్టెంబర్ 28న పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

