Chandramukhi-2 | చంద్రముఖి-2 సెకండ్ ట్రైలర్ రిలీజ్.. ఈ సారి కొంచెం భయపెట్టింది..!
Chandramukhi-2 | ఎన్ని రకాలుగా సినిమాలను ప్రమోట్ చేసినా.. ఒక్క ట్రైలర్ సినిమా ఫేట్‌ను డిసైడ్ చేస్తుందనడంలో సందేహమే లేదు. టాక్ ఎలా ఉన్నా ట్రైలర్ రీచ్ బాగా ఉంటే మట్టుకు ఓపెనింగ్స్ భారీ రేంజ్లో నమోదవుతుంటాయి.
Chandramukhi-2 | ఎన్ని రకాలుగా సినిమాలను ప్రమోట్ చేసినా.. ఒక్క ట్రైలర్ సినిమా ఫేట్‌ను డిసైడ్ చేస్తుందనడంలో సందేహమే లేదు. టాక్ ఎలా ఉన్నా ట్రైలర్ రీచ్ బాగా ఉంటే మట్టుకు ఓపెనింగ్స్ భారీ రేంజ్లో నమోదవుతుంటాయి. ఇప్పటికే ఎన్నో సినిమాల ఓపెనింగ్స్ విషయంలో ట్రైలర్లు కీలకపాత్రలు పోషించాయి. అలాంటిది చంద్రమఖి వంటి కల్ట్ సినిమా సీక్వెల్ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను కొస మెరుపు కూడా ఆకట్టుకోలేకపోయింది. దానికి తోడు ట్రోలర్ రాయుళ్లకు కావాల్సిన స్టఫ్ అంతా ట్రైలర్లోనే కనిపించింది. ఇక కథ కూడా ఏ మాత్రం మార్చినట్లు అనిపించలదే. అదే కథను 4కేలో చూపించబోతున్న ఫీలింగ్ కలుగింది. ఈ ట్రైలర్‌తో సినిమా గట్టెక్కడం ఖాయమే అనుకుంటున్న టైమ్‌లో సినిమాను సీజీ వర్క్ కారణంగా రెండు వారాలు పోస్ట్ చేశారు.
ఇక సెప్టెంబర్ 28న స్కందకు పోటీగా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. ఇప్పటివరకైతే సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ.. తాజాగా రిలీజైన సెకండ్ ట్రైలర్ కాస్త భయపెట్టింది. మరీ వెన్నులో వణుకు పుట్టేలా లేదు కానీ.. పర్వాలేదనిపించేలానే ఉంది. ఒక పెద్ద బంగ్లా.. ఆ బంగ్లాలో పగతో రగిలిపోతున్న ఆత్మ.. ఆ అత్మను పంపించడానికి హీరో చేసే సహాసాలు. అన్ని హార్రర్ కథలలానే ఇది కూడా ఉండబోతుందని ట్రైలర్లతో క్లారిటీ వచ్చేసింది. అయితే యాక్షన్ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలట. ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌లో ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి.
కథలో కొత్తదనం ఉండి, కాస్త ఎంటర్టైన్ చేయగలిగితే ఒకే కానీ.. కంటెంట్‌లో ఏ మాత్రం తేడా కొట్టినా మొదటికే మోసం వచ్చే చాన్స్ ఉంది. పైగా ఈ మధ్య రిలీజైన ఖుషి కేవలం రన్‌టైమ్ ఎక్కువ ఉండటంతోనే రివ్యూలు అలా వచ్చాయన్నది ఓపెన్ టాక్. పైగా చంద్రముఖి ఒరిజనల్ వెర్షన్ 2గంటల 46 నిమిషాలు. ఇక ఇప్పుడు 4 నిమిషాలు అదనంగా ఈ సినిమా నిడివి ఉండనుంది. కంగనా రనౌత్, కీరవాణి వంటి దిగ్గజాలు సినిమాలో భాగం కావడంతో పాన్ ఇండియా లెవల్లో చెప్పుకోదగ్గ క్రేజే నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

