నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రముఖి-2’. 2005లో విడుదలైన ‘చంద్రముఖి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. సీనియర్ దర్శకుడు పి.వాసు తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘స్వాగతాంజలి…’ అనే లిరికల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘తాజాగా విడుదల చేసిన ఈ పాటను శ్రీనిధి తిరుమల పాడగా, చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. ఈ పాటలో రాజనర్తకి చంద్రముఖిలా కంగనా చేసే డ్యాన్స్ అలరిస్తుంది. వినాయకచవితికి ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. వడివేలు, లక్ష్మీమీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి.