Chandra Barot | భారతీయ చిత్రపరిశ్రమలో విషాదం.. అమితాబ్ ‘డాన్’ మూవీ దర్శకుడు చంద్ర బారోట్ కన్నుమూత
Chandra Barot | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ (86) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘డాన్’ మూవీకి దర్శకత్వం వహించారు. 1978లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Chandra Barot | భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ (86) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన ‘డాన్’ మూవీకి దర్శకత్వం వహించారు. 1978లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్‌ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీ బిగ్‌బీ అమితాబ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే, గత ఏడు సంవత్సరాలుగా పల్మనరీ ఫైబ్రోసిస్‌తో పోరాడుతున్నారు. గత ఏడు సంవత్సరాలుగా ఆయన పల్మనరీ ఫైబ్రోసిస్‌తో పోరాడుతున్నట్లు ఆయన భార్య దీపా బారోట్ తెలిపారు. గురునానక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చికిత్స పొందారు. గతంలో ఆయన జస్లోక్ ఆసుపత్రిలో చేరారు.
చంద్ర బారోట్ ఆయన కెరియర్లో మొత్తం ఐదు సినిమాలను తెరకెక్కించారు. 1970లో తొలిసారిగా పురబ్-పశ్చిమ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత మరో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఇక 1978లో అమితాబ్ బచ్చన్‌తో డాన్ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ డాన్ సినిమాలకే ఓ ఒక పుస్తకంలా నిలిచింది. అప్పట్లోనే ఈ మూవీ రూ.7కోట్లు వసూళ్లు సాధించింది. ఈ మూవీ తర్వాత 1989లో బెంగాలీ చిత్రం ఆశ్రితకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా దాదాపు రూ.3కోట్ల వరకు వసూళ్లు సాధించింది.
1991లో ప్యార్ భార దిల్ సినిమా చేశారు. అనంతరం సినిమాలకు దూరమయ్యారు. ఇదిలా ఉండగా.. బాలీవుడ్లో ఇప్పటికే డాన్ సిరీస్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. షారుక్ ఖాన్ హీరోగా వచ్చాయి. త్వరలో డాన్-3 మూవీ సైతం రానున్నది. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నాడు. చంద్ర బారోట్‌కు క్లాసిక్ మూవీ డాన్‌ను రీమేక్ చేసిన బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ నివాళులర్పించారు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ‘డాన్ మూవీ దర్శకుడు ఇక లేడని తెలిసి బాధపడ్డానంటూ ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

