వీర్, శ్రీహర్ష, నిషా, ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చండిక’. తోట కృష్ణ దర్శకుడు. కోటిపల్లి ప్రొడక్షన్స్ పతాకంపై కె.వి.పాపారావు నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘హారర్, సస్పెన్స్ థ్ల్రిలర్ చిత్రమిది. ప్రతి ఆత్మకు ఓ కథ ఉంటుంది.
అయితే చండిక కథ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా వినని విధంగా ఉంటుంది. చండిక ఎందుకు భయపెట్టాలనుకుంటున్నది అనే అంశం ఆసక్తికరంగా అనిపిస్తుం ది’ అన్నారు. ఈ సినిమాకు తానే కథనందించానని, ఈ నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్, సంగీతం: చేతన్ విన్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: తోట కృష్ణ.