శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. మంగా శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్ 8న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈ టీజర్‌ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
వైజాగ్ నేపథ్యంలో సాగే సరికొత్త ప్రేమకథతో ఈసినిమా రూపొందినట్టు టీజర్ చెబుతున్నది. సుమన్, ఇంద్రజ, అనుష్క లూహార్, యామిని, ఎల్బీ శ్రీరామ్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రుప్ప గోపీకృష్ణ, సంగీతం: ప్రిన్స్ హెన్రీ, నిర్మాణం: హై జాయ్ కమర్షియల్స్.