Jana Nayagan | తమిళనాడు సీఎం దళపతి విజయ్ మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జననాయగన్’ ఎట్టకేలకూ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి అధికారికంగా క్లియరెన్స్ లభించినట్లు సమాచారం. సెన్సార్ బోర్డు సూచించిన పలు కీలక మార్పులను పూర్తి చేసిన తర్వాత జూలై 3న ఈ సర్టిఫికెట్ జారీ అయింది. అయితే బోర్డు నివేదిక ప్రకారం, ఈ సినిమాలో మొత్తం 7 సీన్లను తొలగించగా, మరో 3 సీన్లను రీప్లేస్ చేసినట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా మొత్తం 43 సెకన్ల ఫుటేజ్‌ను తొలగించి, 18 సెకన్ల కొత్త విజువల్స్‌ను యాడ్ చేశారు. ఈ కట్స్ అనంతరం చిత్రం యొక్క మొత్తం రన్‌టైమ్ 180 నిమిషాలుగా ఉన్నట్లుగా టాక్.
ఈ సినిమాలో సెన్సార్ బోర్డు ముఖ్యంగా హింసాత్మక దృశ్యాలపై కట్స్ విధించింది. ఒక ఫైట్ సీక్వెన్స్‌లో పళ్ళు రాలడం, చెవి తెగడం వంటి భయానక విజువల్స్‌తో పాటు, తీవ్రమైన రక్తపాతం ఉన్న సీన్ల నిడివిని తగ్గించారు. పేలుడు సీన్లో మనిషి మడమ ఎగిరిపడే విజువల్‌ను కూడా మార్చేశారు. వీటితో పాటు సినిమా ప్రారంభంలో ఎనిమిది సెకన్ల పాటు డ్రగ్స్ వ్యతిరేక (Narcotics) హెచ్చరికను, పొగాకు వ్యతిరేక హెచ్చరికల పరిమాణాన్ని పెంచి ప్రదర్శించాలని బోర్డు ఆదేశించింది. అలాగే చిత్రంలో పలుచోట్ల వాడిన అసభ్య పదజాలాన్ని మ్యూట్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజూ కీలక పాత్రలు పోషించారు.