శంకర్‌పై హైకోర్టులో కేసు?

‘అన్నియన్'(తెలుగులో ‘అపరిచితుడు’) చిత్ర హిందీ రీమేక్ హక్కుల విషయంలో దర్శకుడు శంకర్, తమిళ నిర్మాత రవిచంద్రన్ మధ్య మొదలైన వివాదం మరింత రాజుకుంటోంది. ఈ రీమేక్‌ను నిలిపివేయాలంటూ దర్శకుడు శంకర్, హిందీ నిర్మాత జయంతీలాల్ గదలపై రవిచంద్రన్ కేసు వేయబోతున్నట్లు తెలిసింది. విక్రమ్ కథానాయకుడిగా 2005లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘అన్నియన్’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను రణ్‌వీర్‌సింగ్‌తో హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఇటీవల శంకర్ ప్రకటించారు. ఈ రీమేక్ విషయంలో సర్వహక్కులు తనకే ఉన్నాయని నిర్మాత రవిచంద్రన్ అంటున్నారు. చిత్ర కథ తన సొంతమని, శంకర్ కేవలం దర్శకత్వ బాధ్యతల్ని మాత్రమే చేపట్టారని ఆయన చెబుతున్నారు. ఈ వివాదంపై ఇప్పటికే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను రవిచంద్రన్ ఆశ్రయించారు. తాజాగా ఆయన మద్రాస్ హైకోర్టులో శంకర్‌తో పాటు హిందీ నిర్మాతపై కేసు వేయబోతున్నట్లు తెలిపారు. ఈ రీమేక్ విషయంలో నిర్మాతతో తప్ప శంకర్‌తో తాను చర్చించాల్సిందేమీ లేదని రవిచంద్రన్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

