Shourie Chandrasekhar | కప్పెలను ఏ భాషలోనైనా రీమేక్ చేయొచ్చు.. బుట్టబొమ్మ డైరెక్టర్ శౌరి చంద్రశేఖర్ చిట్ చాట్
అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). శౌరి చంద్రశేఖర్ రమేశ్ (Shourie Chandrasekhar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా శౌరి చంద్రశేఖర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ట,అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ (Shourie Chandrasekhar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శౌరి చంద్రశేఖర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నారు.
మీ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది. ?
నేను ఎంబీఏ (మార్కెటింగ్) పూర్తి చేశా. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చా. కెరీర్ తొలినాళ్లలో శూల్, లవ్ లియే కుచ్ బీ కరెగా, బర్దాస్థ్ వంటి హింది సినిమాలకు పనిచేశాను. ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌ను కలిసి జగడం సినిమాకు పనిచేశా.
మీ డెబ్యూ సినిమాగా రీమేక్‌నే ఎందుకు ఎంచుకున్నారు..?
ప్యాండమిక్ సమయంలో కప్పెల సినిమా చూశా. స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది. ఈ చిత్రాన్ని ఏ భాషలోనైనా రీమేక్ చేయొచ్చనిపించింది. ఎక్జయిటింగ్‌గా చినబాబుగారిని సంప్రదించా. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుట్టబొమ్మ ఒకే అయింది.
బుట్ట బొమ్మ నటీనటుల గురించి..
గౌతమ్ వాసుదేవన్ తెరకెక్కించిన క్వీన్‌లో అనిఖా సురేంద్రన్ యాక్టింగ్ చాలా నచ్చింది. చినబాబు గారికి అనిఖా సురేంద్రన్ పేరు సూచించగానే ఒకే చేశారు. అర్జున్ దాస్ చాయిస్ పూర్తిగా నాగవంశీదే. సూర్య పేరును చినబాబు, వంశీ సూచించారు. స్క్రీన్ టెస్ట్ పూర్తయ్యాక ఇంప్రెసివ్‌గా ఉండటంతో సూర్యను తీసుకున్నాం. బుట్టబొమ్మ నటీనటులందరికీ మంచి ఫేం తెచ్చి పెడుతుందని ఖచ్చితంగా చెప్పగలను.
ఒరిజినల్‌తో పోలిస్తే బుట్టబొమ్మలో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా..?
మన సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్టుగా చాలా మార్పులు చేశాం. కోర్ పాయింట్ మార్చలేదు. కానీ ఫస్ట్ హాఫ్ కొంత స్క్రీన్‌ప్లేలో మార్పు కనిపిస్తుంది. సినిమా చూశాక కప్పెల డైరెక్టర్ కూడా ఈ ఆలోచన నాకెందుకు రాలేదని ఆలోచిస్తాడు.
సినిమా సంగీతం గురించి..
సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గోపీసుందర్ చాలా ఫ్రెష్ ఫీల్ అందించేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు స్వీకార్ అగస్థి కూడా ఓ పాట కంపోజ్ చేశారు.
మీ కొత్త సినిమా గుర్తించి..
ప్రస్తుతానికి కొత్త సినిమాలేవి సైన్ చేయలేదు. కానీ నాకు యాక్షన్ సినిమాను డైరెక్ట్ చేయాలనుంది. ఒకవేళ ఏదైనా సినిమాకు ఒకే చెప్తే మీతో షేర్ చేసుకుంటా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

