Maa Oori Polimera-2 Movie | రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలో విడుదలై పెను సంచలనాలు సృష్టించిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. బ్లాక్ మేజిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓటీటీలో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. హాట్‌స్టార్‌లో నేరుగా విడుదలైన ఈ సినిమా కొన్ని రోజుల పాటు ట్రెండింగ్‌లో ఉంది. ఇక సత్యం రాజేష్ నటనైతే వేరే లెవల్. అప్పటివరకు కామెడియన్‌గా మెప్పించిన సత్యం రాజేష్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా తనలోని విలక్షణ నటనను చూపించాడు. ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సీక్వెల్‌ను వెంటనే ప్రకటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపకుంటుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్ గట్రా సీక్వెల్‌పై వీర లెవల్లో అంచనాలు నెలకొల్పాయి.
తొలి పార్టుకు వచ్చిన క్రేజ్ చూసి మేకర్స్ సీక్వెల్‌ను ఎట్టి పరిస్థుతుల్లో థియేటర్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని మేకింగ్‌కు కాస్త ఎక్కువ ఖర్చే పెట్టారు. ఇకఈ సినిమాను నవంబర్ 2న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. కాగా తాజాగా ఈ సినిమాకు బన్నీ వాసు చేయి తోడైంది. ఈ సినిమాను జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాసు రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్ల సమస్య ఉండదు. పైగా ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో జరుపుతారు. ఈ దెబ్బకు మా ఊరి పొలిమేర-2 రీచ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.
ఇక సీక్వెల్ పార్టు తొలిభాగానికి మించి ఉండనున్నట్లు టీజర్‌తో స్పష్టం చేశారు. రెండో భాగంలో చేతబడిని మరింత క్రూరంగా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తొలిపార్టు మొత్తం ఒక ఊరిలోనే సాగగా.. సెకండ్ పార్ట్ మాత్రం పలు లొకేషన్లలో తెరకెక్కించారు. కావాల్సిన బజ్ క్రియేట్ చేస్తే మట్టుకు పొలిమేర-2కు భారీ ఓపెనింగ్స్ రావడం పక్కా.