టాలీవుడ్ స్టార్స్‌లో మహేష్ బాబు, అల్లు అర్జున్ తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలను రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ని అలరిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలలోకి రాకముందే వీరికి సెలబ్రిటీ స్టేటస్ దక్కింది. మహేష్ తనయుడు గౌతమ్ 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వగా కూతురు సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వకపోయిన అంతకన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ఇక అల్లు అర్జున్ పిల్లలు.. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని ప్రమోషన్ సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. కూతురు అర్హ శాకుంతలం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్హ భరతుడి పాత్ర పోషిస్తుంది. తాజాగా శాకుంతలంలో అర్హకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఆమెకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది.
అర్హ, బన్నీకి సంబంధించిన స్పెషల్ మూమెంట్స్‌ని ఎప్పటికప్పుడు స్నేహా రెడ్డి తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూనే ఉంటుంది.తాజాగా బన్నీ తన ఇంట్లో కూతురితో కలిసి సరదాగా ఆడుతున్నాడు. బబుల్ గన్ తో బబుల్స్ వదులుతుంటే వాటితో ఎంతో చక్కగా ఆడుకుంటున్న అల్లు అర్హని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.