The Warriorr Movie | రామ్ ‘ది వారియర్’ నుండి ‘బుల్లెట్’ వీడియో సాంగ్ వచ్చేసింది..!
Bullet Video Song | రామ్ పోతినేని హీరోగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘ది వారియర్’. భారీ అంచనాల నడుమ గత నెల 15న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం రొటీన్‌గా ఉండటం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ చిత్రంలో ఏదైనా ప్లస్ ఉందంటే, అది దేవి శ్రీ ప్రసాద్ పాటలే. విడుదలకు ముందే ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ పాట రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు తమిళనాట కూడా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ పాట వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటలో రామ్, కృతి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఫిదా చేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను కోలీవుడ్ హీరో శింబు, హరిప్రియ ఆలపించారు. ఇప్పటికే లిరికల్ సాంగ్‌ను యూట్యూబ్‌లో 19కోట్ల మంది వీక్షించారు. కాగా ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11నుండి స్ట్రీమింగ్ కానుంది. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ నిర్మించాడు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
‘ది వారియర్’ చిత్రానికి దాదాపు రూ.35 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. పైనల్గా రూ.21కోట్ల కలెక్షన్లను సాధించి ఫ్లాప్‌గా మిగిలింది. అయితే ఈ చిత్రానికి వచ్చిన టాక్‌కు ఇంత మొత్తంలో కలెక్షన్స్ వచ్చాయంటే విశేషం అనే చెప్పాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

