The Warrior | ‘ది వారియర్’ చిత్రం నుంచి ‘బుల్లెట్’ సాంగ్ ప్రోమో.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
Bullet Song Sneak Seek | | విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో రామ్ పోతినేని. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరచుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో పూర్తి మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే భావనతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’లో కూడా సిద్ధార్థ పాత్రలో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూలై 14న విడుదల కానుంది.
ఎప్పటికప్పుడు ఈ చిత్రం నుంచి ఏదో ఒక అప్డేట్ను మేకర్స్ ప్రకటిస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను తిప్పుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘బుల్లెట్ సాంగ్’ స్నీక్ పీక్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించాడు. ఇటీవలే శింబు సాంగ్ రికార్డింగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాట ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఏప్రిల్ 22, 5.45 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రోమోలో తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. రామ్‌కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

