Bubblegum Movie | ‘బబుల్గమ్’ నుంచి రొమాంటిక్ సాంగ్ ‘ఈజీ పీసీ’ రిలీజ్
Bubblegum Movie | టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’ (Bubblegum). రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Bubblegum Movie | టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’ (Bubblegum). రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మానస చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే సినిమా బబుల్గమ్ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లను విడుదల చేయగా.. యూత్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి ‘ఈజీ పీసీ’(Easy Peasy) అనే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు దర్శకుడు రవికాంత్ పేరెపు స్వయంగా లిరిక్స్ అందించగా.. అంబికా శశిత్తాల్, ఎం శ్రావణ్ చక్రవర్తి పాడారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఫుల్ రొమాంటిక్‌గా సాగిన ఈ పాట ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రియురాలి వల్ల అవమానం ఎదుర్కొన్న ఓ యువకుడు.. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాడు, ఏ విధంగా ఆమెపై రివెంజ్ తీర్చుకున్నాడు అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
మరోవైపు.. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ‘బబుల్గమ్’ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది. మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

