Bubblegum Movie | టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala), యాంకర్ సుమ (Anchor Suma)ల తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’(Bubblegum). రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే సినిమా బబుల్గమ్ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లను విడుదల చేయగా.. యూత్‌ను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు షాక్ ఇచ్చింది. ‘బబుల్గమ్’ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డు వెల్లడించింది. మూవీలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రియురాలి వల్ల అవమానం ఎదుర్కొన్న ఓ యువకుడు.. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాడు, ఏ విధంగా ఆమెపై రివెంజ్ తీర్చుకున్నాడు అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
#Bubblegum – A – 29th December Release pic.twitter.com/CIxOfPikXz
— Aakashavaani (@TheAakashavaani) December 23, 2023
ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ-మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. బబుల్గమ్లో మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోండగా.. ప్రీ లుక్ పోస్టర్లో హీరోహీరోయిన్లు సూపర్ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు.