సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ భామ శిల్పాశెట్టి (Shilpa Shetty). దీంతోపాటు తెలుగులో మరో మూడు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీపైనే ఫోకస్ పెట్టిన ఈ భామ రీసెంట్గా ఎంసీఏ హిందీ రీమేక్ నికమ్మ చిత్రంలో మెరిసింది. ఈ భామ ప్రస్తుతం రోహిత్ శెట్టి డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్టు ఇండియన్ పోలీస్ ఫోర్స్ ( Indian Police Force) అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది.
ఇటీవల హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌కు సంబంధించిన బీటీఎస్ స్టిల్ ఒకటి షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్‌గా నిలిచింది. అయితే శిల్పాశెట్టికి ఊహించని విధంగా లెగ్ ఫ్యాక్చర్ అయింది. ఈ సీక్వెన్స్ షూటింగ్ టైంలో శిల్పాశెట్టికి కాలికి గాయమైంది. దీంతో డాక్టర్లు ఆమెకు చికిత్సనందించారు.
ఎడమకాలికి పట్టీ వేసి ఉండగా..చిల్ అవుట్ అవుతూ కెమెరాకు ఫోజులిచ్చింది శిల్పాశెట్టి. ఈ స్టిల్‌ను చూసిన అభిమానులు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని శిల్పాశెట్టికి సూచిస్తున్నారు. శిల్పాశెట్టి నటిస్తోన్న సుఖీ ప్రాజెక్టు కూడా షూటింగ్ దశలో ఉంది.
They said, Roll camera action – “break a leg!” I took it literally😂😜 🤦🏽♀️
Out of action for 6 weeks, but I’ll be back soon stronger and better. Till then, dua mein yaad rakhiyega 🙏🤲🏼
Prayers always work 😇With gratitude,
Shilpa Shetty Kundra ♥️🧿✨ pic.twitter.com/Y2muSjdCYr— SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 10, 2022