Vinodaya Sitham Remake | పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ మూవీ టైటిల్ ఇదేనా?
Vinodaya Sitham Telugu Title | పవన్ కళ్యాణ్ లైనప్‌లో 'వినోదయ సిత్తం' రీమేక్ ఒకటి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో కోట్ల ప్రశంసలు దక్కించుకున్న వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది.
Vinodaya Sitham Telugu Title | పవన్ కళ్యాణ్ లైనప్‌లో ‘వినోదయ సిత్తం’ రీమేక్ ఒకటి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళంలో కోట్ల ప్రశంసలు దక్కించుకున్న వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ కథలో పలు మార్పులు చేర్పులు చేశాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించబోతున్నట్లు గతరెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకు బ్రో అనే టైటిల్‌ను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. పవన్ ఈ సినిమాలో సాయితేజ్‌ను బ్రో అని పిలుస్తాడని.. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి.. తాను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని, దానికి మూడు నెలలు సమయం కావాలని తననీ పైకి తీసుకెళ్లడానికి వచ్చిన దేవుడిని ఓ వరం అడుగుతాడు. దానికి దేవుడు ఒప్పుకోవడమే కాకుండా ఆ మూడు నెలలు ఇక్కడే ఉండి ఆ వ్యక్తితో ప్రయాణిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చనిపోయిన వ్యక్తి తాను అనుకున్న పనులను పూర్తి చేశాడా? అనే కథాంశంతో సాగుతుంది.
దాదాపు అటు ఇటుగా ఇలాంటి కథలను మనం చాలా సార్లు చూశాం. అయితే సముద్రఖని తన స్క్రీన్‌ప్లే, టేకింగ్‌తో ప్రేక్షకులను మాయ చేశాడు. తమిళంలో తంబి రామయ్య పోషించిన పాత్రను సాయిధరమ్ తేజ్ చేస్తున్నాడు. దేవుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇప్పటికే పవన్ షూటింగ్ పూర్తయిపోయిందని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

