Bro Movie Producer | చాలా రోజుల తర్వాత పెద్ద సినిమా రిలీజైతే బాక్సాఫీస్ దగ్గర సందడి మాములే. అందులోనూ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ సినిమా వస్తే కలెక్షన్లకు ఏ డోకా ఉండదు. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీకెండ్లోనే బడ్జెట్లో సగం కంటే ఎక్కువే రికవరీ అవుతుంది. బ్రో సినిమా విషయంలోనూ అదే జరిగింది. బ్రో మూవీ తొలిరోజే దాదాపు పాతిక కోట్ల రేంజ్లో షేర్ కలెక్షన్లు రాబట్టి పవర్ స్టార్ రేంజ్ ఏంటో మరోసారి బాక్సాఫీస్ దగ్గర నిరూపితం అయింది. రీమేక్ సినిమా, పైగా అస్సలు ఫైట్స్ గట్రా లేని సినిమా. అయిన కానీ ఆ రేంజ్లో కోట్లు కొల్లగొట్టడం ఒక్క పవన్ కళ్యాణ్‌కే చెల్లింది. తొలి రోజే అనుకుంటే ఆ తర్వాత రెండు రోజులు కూడా సినిమా మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్లోనే దాదాపు రూ.55 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది.
అయితే వీక్‌డేస్‌లో ఈ సినిమా చాలా వీక్ అయిపోయింది. తొలి మూడు రోజుల్లో రూ.55 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఆ తర్వాత రెండు రోజుల్లో పట్టుమని పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. వీకెండ్లో ఎక్ప్రెస్లా దూసుకుపోయిన ఈ సినిమా వీక్ డేస్‌లో ప్యాసింజర్ బండిలా కదులుతుంది. అయితే ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ మాత్రం తను ఆల్రెడీ ఫ్రాఫిట్ జోన్లో ఉన్నానని చెప్పడం గమనార్హం. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో బ్రో సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌తోనే 60-70% పెట్టుబడి తిరిగి వచ్చేసిందని తెలిపాడు. ఇక ఈ మూవీ థియేట్రికల్ రన్ ఏ స్థాయిలో సాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రొడ్యూసర్‌గా తను మాత్రం బ్రో సినిమాతో చాలా హ్యాపిగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
దీనిపై కొంత మంది నెటిజన్లు మాత్రం ప్రొడ్యూసర్లు చాలా వరకు సేఫ్‌గానే ఉంటారు. లాస్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిత్రయూనిట్ చెప్పిన లెక్కల ప్రకారం ఈ సినిమా బిజినెస్ రూ.80 కోట్లపై చీలుకే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది రూ.60 కోట్లు మాత్రమే. ఇది పెద్ద నెంబరే కావచ్చు.. కానీ వీక్ డేస్‌లో ఈ సినిమా కలెక్షన్లు చూస్తే బ్రేక్ ఈవెన్ కోసం చాలా శ్రమించి ఉండాల్సి ఉంటుంది. బంపర్ హిట్‌గా నిలిచిన భీమ్లానాయక్ సైతం ఆంధ్రలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవకుండానే దుకాణం సర్దేసింది.