Bro Movie | టెస్లా కార్లతో బ్రో టైటిల్.. పీక్స్ లెవల్లో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్
Bro Movie Celebrations | మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న బ్రో సినిమాపై అందరిలోనూ వీర లెవల్లో అంచనాలున్నాయి. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. టీజర్, ట్రైలర్లు గట్రా చూస్తుంటే చాలా మార్పులే చేసినట్లు తెలుస్తుంది.
Bro Movie Celebration | మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న బ్రో సినిమాపై అందరిలోనూ వీర లెవల్లో అంచనాలున్నాయి. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. టీజర్, ట్రైలర్లు గట్రా చూస్తుంటే చాలా మార్పులే చేసినట్లు తెలుస్తుంది. ఇక మామ అల్లుళ్లు ఒకే సారి స్క్రీన్‌పై కనిపిండనుండంతో మెగా ఫ్యాన్స్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో బిజీగా గడిపేస్తున్నారు.
ఇక అభిమానులు అనే మాట గురించి చెప్పాలంటే ముందుగా గుర్తోచ్చేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచమంతటా పవన్‌కు తిరుగులేని ఫ్యానిజం ఉంది. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. భారీ కటౌట్లు, ఫ్లెక్స్‌లతో థియేటర్లు నిండిపోతుంటాయి. కాగా తాజాగా అమెరికాలో పవన్ ఫ్యాన్స్ బ్రో సినిమా రిలీజ్ సందర్భంగా సందడి చేస్తున్నారు. టెస్లా కార్లతో బ్రో సినిమా టైటిల్ లైట్ షో ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. యూఎస్ఏలో మూడు చోట్ల ఈవెంట్ జరిగినట్లు చిత్రయూనిట్ పేర్కొంది.
పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిధరమ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తుంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ వంద కోట్లు దాటిందని తెలుస్తుంది. ఒక్క ఆంధ్ర ఏరియాలోనే దాదాపు రూ.50 కోట్ల రేంజ్లో బిజినెస్ జరుగిందట. ఇక ఓవర్సీస్లో రూ.13 కోట్లు డీలింగ్ ఇప్పటికే ఫిక్సయిపోయింది. నైజాం సహా మిగిలిన ఏరియాలు అన్ని కలుపుకుని మొత్తంగా వంద కోట్ల నెంబర్ అయితే దాటిందని. ఒక రీమేక్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Aerial View #BroTheAvatar https://t.co/dd5Dw6Xzp9 pic.twitter.com/S6SUh9LDM2
— scan the bans (@chirucharanfan) July 24, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

