Bro Movie | పవన్ క్రేజా మజాకా.. తొలిరోజే కుండపోత వసూళ్లు
Bro Movie Collections | నిన్న విడుదలైన బ్రో సినిమాకు కాస్త అటు ఇటుగా రివ్యూలు వచ్చినా.. ఫ్యాన్స్‌కు కావాల్సిన స్టఫ్ ఉండటంతో విచ్చలవిడిగా కలెక్షన్లు వచ్చిపడుతున్నాయి. తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర పవన్ మేనియా ఏంటో మరోసారి నిరూపితం అయింది.
Bro Movie Collections | నిన్న విడుదలైన బ్రో సినిమాకు కాస్త అటు ఇటుగా రివ్యూలు వచ్చినా.. ఫ్యాన్స్‌కు కావాల్సిన స్టఫ్ ఉండటంతో విచ్చలవిడిగా కలెక్షన్లు వచ్చిపడుతున్నాయి. తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర పవన్ మేనియా ఏంటో మరోసారి నిరూపితం అయింది. రీమేక్ సినిమా.. పైగా కమర్షియల్ అంశాలకు తావు లేని సబ్జెక్ట్, అయినా కానీ ఆ రేంజ్ కలెక్షన్లు అంటే మాములు విషయం కాదు. పవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే రిపీటెడ్ షోలు వేసేస్తున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం థియేటర్లకు బారులు తీరుతున్నారు. దాదాపు నెలన్నర తర్వాత పెద్ద సినిమా రిలీజవడంతో హాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి.
ఈ సినిమా దెబ్బతో హాలీవడ్ సినిమాలు బార్బీ, ఓపెన్ హైమర్ కలెక్షన్లు సైతం హైదరాబాద్‌లో తగ్గిపోయాయని ఇన్సైడ్ రిపోర్ట్స్. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న రాకీ ఓర్ రాణీకి ప్రేమ్ కహాని సినిమాను పట్టించుకున్న నాధుడే లేరట. పేరుకు హిందీ సినిమానే అయినా.. హైదరబాద్ వంటి పలు నగరాల్లో మంచి ఆక్యూపెన్సీలే నమోదయ్యాయి. అయితే బ్రో సినిమా దెబ్బతో ఆ సినిమా షోలు క్యాన్సిల్ చేసి మరీ ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారట. ఇక ఫస్డ్ వీకెండ్ ఎలాగో జోరు కనిపిస్తుంది. సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలు కానుంది.
అయితే ఇప్పటికే పావువంతు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా శని, ఆది వారాల బుకింగ్స్ కూడా సాలిడ్‌గా ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో మరో నలభై నుంచి యాభై కోట్లు కలెక్ట్ చేసినా.. ముప్పావువంతు బడ్జెట్ రికవరీ అయిపోతుంది. పైగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశమే. రెండు వారాల తర్వాత రిలీజ్ కాబోతున్న భోళా శంకర్ వరకు ఈ సినిమాకు టైమ్ ఉంది. ఈ లోపు ఈజీగా బ్రేక్ ఈవెన్ పూర్తయిపోతుందని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

