BAFTA Awards | బాఫ్టా అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఓపెన్‌హైమర్’.. ఏకంగా ఏడు అవార్డులు
BAFTA Awards | హాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (British Academy Film Awards) అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (ఫిబ్రవరి 18) రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్ వేదికగా అట్టహాసంగా జరిగాయి.
BAFTA Awards | హాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో సత్తా చాటింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (British Academy Film Awards) అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (ఫిబ్రవరి 18) రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్ వేదికగా అట్టహాసంగా జరిగాయి. ఇక ఈ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రం ‘ఓపెన్‌హైమర్’ సత్తా చాటింది. ఏకంగా ఏడు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది.
ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా (సిలియన్ మర్ఫీ), ఉత్తమ దర్శకుడిగా (క్రిస్టఫర్ నోలన్), ఉత్తమ సహాయ నటుడిగా (రాబర్ట్ డౌనీ జూనియర్), ఉత్తమ ఒరిజినల్ స్కోర్ (లుడ్విగ్ గోరాన్సన్), ఉత్తమ చిత్రం సహా మొత్తం ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ఇక క్రిస్టఫర్ నోలన్‌కు దర్శకుడిగా ఇదే తొలి బాఫ్టా అవార్డు. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఉత్తమ నటి విభాగంలో పూర్ థింగ్స్ (Poor Things) సినిమాలో నటనకు గాను ఎమ్మా స్టోన్(Emma Stone)కు ఈ అవార్డు దక్కింది.
2024 బాఫ్టా విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం – ఓపెన్‌హైమర్
ఉత్తమ నటుడు – సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయ నటుడు – రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయ నటి – డేవిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ స్కోరు – లుడ్విగ్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ – హాట్ వాన్ హోటిమా (ఓపెన్‌హైమర్)
ఉత్తమ స్క్రీన్ ప్లే – జస్టిన్ ట్రిట్, ఆర్థర్ హారీ (అనాటమీ ఆఫ్ ఫాల్)
ఉత్తమ కాస్టింగ్ – ది హోల్డోవర్స్
ఉత్తమ ఎడిటింగ్ – జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ మేకప్ – నాడియా స్టాసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – సైమన్ హ్యూస్
ఉత్తమ సౌండ్ – జానీ బర్న్, టార్న్ విల్లర్స్ (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)
ఉత్తమ డాక్యుమెంటరీ – మారియుపోల్‌లో 20 రోజులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

