Brahmanandam | హైదరాబాద్ మ్యాచ్‌ను దగ్గరుండి గెలిపించిన గచ్చిబౌలి దివాకర్.. బ్రహ్మి ఫోటోలు వైరల్
Brahmanandam | ఐపీఎల్లో సీజన్ 17లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ VS చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఘన విజయం సాధించింది.
Brahmanandam | ఐపీఎల్లో సీజన్ 17లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ VS చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రికార్డు స్కోర్‌తో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను వణికించింది. తొలుత సీఎస్కేను 165 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్ స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. 6 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసి మెగా టోర్నీలో రెండో విజయం సాధించింది. ఈ విక్టరీతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.
ఈ మ్యాచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖలు వెంకటేష్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యి సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్‌కు టాలీవుడ్ స్టార్ కామెడియన్ బ్రహ్మనందం కూడా వచ్చి సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు జోష్ నింపిన విషయం తెలిసిందే. ఇక బ్రహ్మనందం ఈ మ్యాచ్‌కు రావడం వలనే బ్రహ్మనందం గెలిచిందని.. గచ్చిబౌలి దివాకర్ (బ్రహ్మనందం) దగ్గరుండి గెలిపించాడని సోషల్ మీడియాలో అభిమానులు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
“GachhiBowli Diwakar” Ground lo Dhaggrarundi SRH ki Match Win Chepinchadu 😍🔥#SRHvCSK #OrangeArmy #SRH#Brahmanandam #IPL2024 pic.twitter.com/gRq1FXzeO3
— 𝙉𝘼𝙉𝘿𝘼 (@Nanda_927) April 5, 2024
సిద్దార్థ్, తమన్నా జంటగా నటించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాలో బ్రహ్మానందం క్రికెట్ వీరాభిమానిగా కనిపించిన విషయం తెలిసిందే. గచ్చిబౌలి దివాకర్ అనే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్‌గా బ్రహ్మానందం కనిపించడంతో ఈ పాత్రను మీమర్స్ తెగ వాడేసుకున్నారు. ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగితే చాలు సోషల్ మీడియాలో ఈ గచ్చిబౌలి దివాకర్ తో మీమ్స్ కనిపిస్తాయి.
Meme God at Uppal..😍#Brahmanandam #CSKvsSRH pic.twitter.com/T316ooQ60K
— Fukkard (@Fukkard) April 5, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

