మీ కులం వాడినంటూ బ్రహ్మాజీకి ట్వీట్.. సర్ప్రైజ్ ఆన్సర్ ఇచ్చిన సీనియర్ నటుడు

సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో చాలా రిక్వెస్ట్స్ వస్తుంటాయి. ఇందులో కొన్నింటిపై వారు దృష్టి పెడుతుండగా, కొన్నింటిని లైట్ తీసుకుంటూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కి వెంటనే స్పందించి తనదైన శైలిలో జవాబిచ్చారు. ఓ నెటిజన్.. ‘అన్నా నేను మన కమ్యునిటీకి చెందిన వాడని.. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. మీ తరుపున ఏ చిన్న అవకాశం ఉన్నా నాకు ఏదో పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించగలరని మిక్కిలి కోరుకుంటున్నాను’ అంటూ బ్రహ్మాజీ ప్రొఫైల్ ఫొటోకింద కామెంట్ పెట్టాడు.
నెటిజన్ కామెంట్‌కు వెంటనే స్పందించిన బ్రహ్మాజీ .. ‘నేను ఇండియన్ని.. తెలుగోడిని.. అదే నా కమ్యునిటీ’ అంటూ రిప్లై ఇచ్చారు. అవకాశం కావాలంటే అడగాలి కాని, కులం గిలం ఏంట్రా నాయనా అంటూ బ్రహ్మాజీ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఆ మధ్య బ్రహ్మాజీకి లాటరీ వచ్చిందని ఓ మెసేజ్ రాగా, దానిని పోలీసులకి ట్యాగ్ చేసి మీరు ఈ బహుమతి తీసుకోండని బ్రహ్మాజీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

