Dhurandhar 2 | ఓటీటీలోకి ‘ధురంధర్ 2’.. ఈరోజు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్!
Dhurandhar 2 | ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.
Dhurandhar 2 | ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, ఈరోజు సాయంత్రం నుంచే డిజిటల్ వేదికపైకి రానుంది. భారత్‌లో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శితం కానుంది, అలాగే జూన్ 5 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
థియేటర్లలో కట్ చేసిన కొన్ని సీన్స్, అన్ఫిల్టర్డ్ డైలాగ్స్‌తో కూడిన ప్రత్యేక వెర్షన్ కట్‌ను భారత్‌లో జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. దీనికి ముందు సాయంత్రం ఒక 30 నిమిషాల బిహైండ్-ది-సీన్స్ ప్రీ-షో కూడా ఉండనుంది. ఇక విదేశాల్లోని సినీ అభిమానుల కోసం ఈ మూవీ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌లో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించారు. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ యాక్షన్ విజువల్ ఫీస్ట్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈరోజు సాయంత్రం నుంచి ఓటీటీలో చూసేయొచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

