Border 2 Ghar Kab Aaoge | బాలీవుడ్ క్లాసిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘బోర్డర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించి సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని ఎమోషనల్ సాంగ్ “ఘర్ కబ్ ఆవోగే” (Ghar Kab Aaoge) పూర్తి స్థాయి వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. 1997 నాటి ఐకానిక్ పాటను పునర్నిర్మించిన ఈ వెర్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను ఒరిజినల్ గాయకులు సోనూ నిగమ్, రూప్ కుమార్ రాథోడ్‌లతో కలిసి నేటి తరం గాయకులు అర్జిత్ సింగ్, విశాల్ మిశ్రా, దిల్జీత్ దోసాంజ్ అద్భుతంగా ఆలపించారు. అను మాలిక్ స్వరపరిచిన ఒరిజినల్ ట్యూన్‌కు సంగీత దర్శకుడు మిథూన్ సరికొత్త హంగులు అద్దారు. దాదాపు 10 నిమిషాల నిడివి గల ఈ వీడియో సాంగ్‌లో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ మరియు అహన్ శెట్టి సైనికుల భావోద్వేగాలను, వారి త్యాగాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. 1971 భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 23, 2026న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.