Bootcut Balaraju | బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. మేఘ లేఖ కథనాయికగా నటించగా శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించాడు. గ్లోబల్ ఫిలిమ్స్, కథ వేరుంటాది బ్యానర్స్‌పై ఎండీ పాషా ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం ఫిబ్రవరి 02న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీకి మొదటినుంచే డివైడ్ టాక్ రావడంతో థియేటర్లలో జనాలు ఎవరు కనిపించడం లేదు. అయితే సినిమా చూసేందుకు ఓ థియేటర్‌కు వెళ్లిన సోహైల్ థియేటర్ ముందు తన ఆవేదన వెళ్లగక్కాడు. నేను కుటుంబమంతా కలిసి చూసే సినిమా చేశాను. కంటెట్ ఉన్న సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారు నాకు తెలుసు. ఇది కూడా అలాంటి మంచి సినిమా. అందరూ వెళ్లి సినిమా చూడండి అన్న అంటూ అభిమానులను వేడుకున్నాడు. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది అన్న వెళ్లి చుడండి అన్న అంటూ సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Reality after Bigg Boss’s online fake hype bubble bursted. #BootCutBalaraju #Sohel pic.twitter.com/f7yRT5STLF
— Actual India (@ActualIndia) February 3, 2024