బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్‌ఖాన్ వ్యక్తిత్వంలోని నిజాయితీ, అందరిని ఒకేలా గౌరవించే గొప్ప మనసు తననెంతగానో ఆకట్టుకున్నాయని చెప్పింది పూజాహెగ్డే. ఇటీవల విడుదలైన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టిందీ అమ్మడు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే ప్రచారం కూడా జరిగింది. కొన్ని బాలీవుడ్ పత్రికలు సల్మాన్‌ఖాన్‌తో పూజాహెగ్డే డేటింగ్లో ఉందనే కథనాలు ప్రచురించాయి. అయితే వీటిని ఖండించింది పూజాహెగ్డే. ఓ సీనియర్ నటుడిగా సల్మాన్‌ను ఎంతగానో అభిమానిస్తానని పేర్కొంది.
తాజా ఇంటర్వ్యూలో సల్మాన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది పూజాహెగ్డే. ఆమె మట్లాడుతూ ‘ఆయన్ని తొలిసారి కలిసినప్పుడే ఎంతటి నిజాయితీపరుడే అర్థమైంది. మనసులో ఏదీ దాచుకోకుండా మాట్లాడతాడు. ఆయనది చాలా ఉదార స్వభావం. సెట్లో ప్రతి ఒక్కరి ఆహార అభిరుచులు తెలుసుకొని వారికి నచ్చిన భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు. నిజంగా సల్మాన్ దిల్దార్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మహేష్‌బాబు-త్రివిక్రమ్ చిత్రంలో నాయికగా నటిస్తున్నది.