Bollywood Heroines Remuneration | దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను సాధారణంగా వింటుంటాం. సినీరంగంలో కూడా ఇదే సామేత హీరోయిన్ల విషయాలలో బాగా వర్తిస్తుంటుంది. 20’sలో స్టార్ హీరోయిన్గా పేరు వచ్చిందంటే దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల వరకు స్టార్‌గా కొనసాగేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా స్టేటస్‌ను సంపాదించిన మహా అయితే 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే స్టార్ నటిగా కొనసాగుతున్నారు. తర్వాత సినిమా అవకాశాలు పెద్దగా ఉండవు. ఒక వేళ వచ్చినా పెద్దగా స్కోప్ లేని పాత్రలు, సీనియర్ హీరోల పక్కన లీడ్ పేయిర్‌గా నటించడం వంటివి వస్తుంటాయి. ఈ క్రమంలోనే అవకాశాలు వచ్చినప్పుడే హీరోయిన్లు భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో హీరోలకు సమానంగా కూడా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తుంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఎక్కువ పారితోషకం అందుకుంటున్న నటీమణులు వీరే.
దీపికా పదుకొనే:
బాలీవుడ్లో అత్యధికంగా పారితోషికాన్ని అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో దీపికా పదుకొనే ముందు వరుసలో ఉంటుంది. ‘ఐశ్వర్య’ అనే కన్నడ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించిన దీపికా ‘ఓం శాంతి ఓం’ బాలీవుడ్ సినిమాతో డెబ్యూ ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఈమె ‘ప్రాజెక్ట్-K’, ‘పఠాన్’, ‘ఫైటర్’ సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ప్రతి సినిమాకు దాదాపు 30కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని సమాచారం.
కంగానా రనౌత్:
లేడి ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ బీ-టౌన్లో టాప్ హీరోయిన్లలో జాబితాలో ఉంది. లేడి బయోపిక్ సినిమాలకు ఈమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ‘తలైవి’ సినిమాతో మంచి విజయాన్నిఅందుకున్న కంగానా ప్రస్తుతం ఒక్కో సినిమాకు 25-27కోట్ల వరకు పారితోషకాన్ని తీసుకుంటుందని టాక్.
ప్రియాంక చోప్రా:
విజయ్ తలపతి హీరోగా ‘తమిజాన్’ అనే తమిళ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది ప్రియాంక చోప్రా. రెండు దశాబ్ధాల పాటుగా ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగింది. గత రెండు సంవత్సరాల నుంచి హాలీవుడ్ సినిమాలతోనే బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు దాదాపు 25 కోట్ల వరకు పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందట.
కత్రినాకైఫ్:
‘బూమ్’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది కత్రినా కైఫ్. యూత్‌లో ఈమెకి ఉన్న ఫాలోయింగ్ మరే ఇతర నటికి కూడా లేదంటే అతిషయోక్తి కాదు. వెయ్యికి పైగా సినిమాలలో ఈమె పేరును డైలాగ్‌లలో వాడుకున్నట్లు అప్పట్లో రికార్డు కూడా సృష్టించింది.ఇటీవలే ఈమె విక్కీ కౌషల్‌ను పెళ్ళి చేసుకుంది. ప్రస్తుతం ఈమె ఫోన్ ‘బూత్’, ‘మెర్రి క్రిస్మస్’, ‘టైగర్-3’ సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు 22-25కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకుంటుందని సమాచారం.
అలియాభట్:
‘గంగూబాయి కతియావా’డి చిత్రంతో ప్రేక్షకులనే కాకుండా సినీ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో తన నటన, అభినయంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకంటుంది. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల క్లబ్‌ను అధిగమించింది. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు 23కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకుంటుందట.
కరీనాకపూర్:
ఇరవై ఏళ్ళకే సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కరీనా కపూర్ దాదాపు 15 ఏళ్లు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ప్రస్తుతం ఈమె అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుంటుందని టాక్.
అనుష్క శర్మ:
‘రబ్ నే బనాది జోడి’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్కశర్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబీతాలో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె ఒక్కోసినిమాకు 7 నుంచి 10 కోట్ల వరకు రెమ్యనరేషన్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.