Rajinikanth | సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘జైలర్ 2’ గురించి ఒక వార్త ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో మొదట బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ కామియో రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తే గనుక నిజమైతే.. గతంలో రజినీకాంత్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘భగవాన్ దాదా’ (1986) చిత్రం తర్వాత, దాదాపు 40 సంవత్సరాల అనంతరం వీరిద్దరూ కలిసి మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో భారీ ఎత్తున చిత్రీకరించనున్నట్లు ఇండస్ట్రీ టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మైండ్ బ్లోయింగ్ క్రేజీ అప్డేట్ ఇటు సౌత్ ఇండస్ట్రీతో పాటు అటు నార్త్ ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లింది.
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, ఎస్.జె.సూర్య, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సీనియర్ నటి రమ్యకృష్ణ, మిర్నా మీనన్, హాస్య నటుడు యోగి బాబు వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా, ఈ ఏడాది చివర్లోనే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.