ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి కరోనా నెగెటివ్‌గా నిర్దారణ అయింది. త్వరలోనే బన్సాలీ గంగూబాయ్ కథియావాడి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు.
ఇటీవలే కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో రెండు వారాలుగా హోం క్వారంటైన్లో ఉన్నారు బన్సాలీ.
మరోవైపు తన బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌కు పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఇటీవలే అలియా కూడా హోం క్వారంటైన్ లో ఉంది.
హోం క్వారంటైన్ లో ఉన్న తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవడంతో నెగెటివ్ గా నిర్దారణ అయింది.
ఇది గొప్ప విషయం. తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసే వరకు సంజయ్ తిరిగి రావడం ఇష్టం లేదు. క్వారంటైన్ ముగిసే వరకు ఆయన తల్లిని కూడా కలవడని బన్సాలీ సన్నిహితుడొకరు చెప్పుకొచ్చారు.
ఇపుడు డైరెక్టర్ బన్సాలీ, హీరోయిన్ అలియాభట్ కరోనా నుంచి ఉపశమనం పొందడంతో గంగూబాయ్ కథియావాడి చిత్రం షూటింగ్ కు లైన్ క్లియర్ అయింది.