Mahesh Babu on Bollywood | బాలీవుడ్ నన్ను భరించలేదు.. మహేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు
Mahesh Babu on Bollywood | బాలీవుడ్ తనను భరించలేదని, అటువంటప్పుడు తన టైం వేస్ట్ చేసుకోలేనని సూపర్‌స్టార్ మహేశ్ వ్యాఖ్యానించాడు.
Mahesh Babu on Bollywood | బాలీవుడ్‌కు తనను భరించే స్థోమత లేదని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల అడివి శేషు `మేజర్` ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మహేశ్ బాబును బాలీవుడ్ సినిమాల్లో నటనపై అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఇది. మేజర్ సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు హిందీ సినిమాల నుంచి బోల్డన్ని ఆఫర్లు వస్తున్నా.. వారు తనను భరించగలరని నేను భావించడం లేదన్నారు.
తనను భరించలేని వారి వద్ద పని చేసి తన టైం వేస్ట్ చేసుకోనని స్పష్టం చేశారని ఇండియా టుడే, న్యూస్ 18 తదితర మీడియా సంస్థల్లో వార్తలొచ్చాయి. తనకు ఇక్కడ బోల్డ్ స్టార్డమ్ ఉందని, భారీగా గౌరవం పొందుతున్నానని, తన టాలీవుడ్‌ను వదిలి మరో పరిశ్రమకు వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని మహేశ్ బాబు చెప్పాడు.
మున్ముందు పెద్ద సినిమాల్లో పని చేయాలని తాను ఎల్లవేళలా ఆలోచిస్తానని మహేశ్ బాబు అన్నాడు. తన కల నిజం అవుతున్నా.. ఇప్పుడు సంతోషంగా లేనని పేర్కొన్నాడు. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ తనయుడే మహేశ్ బాబు. బాల నటుడిగా 1989లో పోరాటం సినిమాలో తన తండ్రితో కలిసి సినీ రంగంలో ప్రవేశించాడు. 1999లో ప్రీతిజింటాతో కలిసి రాజకుమారుడు సినిమాలో హీరోగా కెరీర్ ప్రారంభించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

