ముంబై, ఆగస్టు 1: చంపుతామంటూ గ్యాంగ్స్టర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు గన్ లైసెన్స్ జారీచేసినట్టు పోలీస్ అధికారులు సోమవారం వెల్లడించారు. సల్మాన్ ఇటీవల ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్, జాయింట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) విశ్వాస్ నంగ్రే పాటిల్‌ను కలిశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లుచేసి చంపుతామని బెదిరిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు.
అలాగే గన్ లైసెన్స్‌కు కూడా దరఖాస్తు చేసుకొన్నారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీబ్రార్ గ్యాంగ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనకు సెక్యూరిటీని పెంచారు.