SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు?
త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాల్లో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌ను ఎంపిక చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
Saif Alikhan | ‘అల వైకుంఠపురం’లో తర్వాత త్రివిక్రమ్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మహేష్‌తో ‘SSMB28’ తెరకెక్కిస్తున్నాడు. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసికల్ హిట్ల తర్వాత వీళ్ళ కాంబోలో మూడో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ కొన్ని రోజులు షూటింగ్‌ను ఆపేశారు. కాగా డిసెంబర్ రెండు లేదా మూడో వారం నుండి తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది.
మాములుగా త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఈయన తన సినిమాల్లో పాత్రకు న్యాయం చేయగలిగే యాక్టర్లను మాత్రమే ఎంపికచేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌ను ఎంపిక చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇదే గనుక నిజమైతే సైఫ్ అలీఖాన్‌కు తెలుగులో ఈ చిత్రం రెండవది అవుతుంది. ఇక సైఫ్ అలీఖాన్, ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘SSMB28’ చిత్రాన్ని హారిక& హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా నటిస్తుంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

