Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Bollywood Actor Imran Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు, ప్రముఖ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ముంబై పోలీసులు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
Bollywood Actor Imran Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు, ప్రముఖ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ముంబై పోలీసులు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయన రాబోయే అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేస్తూ అధికారికంగా ‘లీవ్ ఇండియా నోటీస్’ (Leave India Notice) జారీ చేయడం సినీ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది.
ముంబైలోని క్రాంతి మైదాన్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ జరిగిన ఈ ఆందోళనలో ఆయన పాల్గొనడం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. ఈ నిరసన కార్యక్రమం సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుందనే కారణంతో ముంబై పోలీసులు ఆయనను అదుపులోకి కూడా తీసుకున్నారు.
అయితే, ఇమ్రాన్ ఖాన్ భారతీయ పౌరుడు కానప్పటికీ, దేశంలో అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నిరసనల్లోనూ, ఆందోళనల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారనే అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. విదేశీ పౌరులు దేశీయ రాజకీయ లేదా నిరసన కార్యక్రమాలలో పాల్గొనకూడదనే నిబంధనను ఉల్లంఘించినట్లు నిర్ధారించుకున్న ముంబై పోలీసులు, ఇమ్మిగ్రేషన్ చట్టంలోని (Immigration Act) సంబంధిత నిబంధనల కింద ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విదేశీ పౌరసత్వం కలిగి ఉండి దేశంలోని నిబంధనలను అతిక్రమించినందున, ఆయన్ను అక్టోబర్ 28 నాటికి దేశం వీడి వెళ్లాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

