సూర్య శ్రీనివాస్, పవన్కేసి, రూపిక ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘చిల్బ్రో’. కుంచం శంకర్ దర్శకుడు. శ్రీను చెంబేటీ నిర్మాత. ఇటీవల ఈ చిత్రంలో ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ‘బొడ్రాయి..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మంగ్లీ పాడిన పాటకు చక్కని స్పందన వస్తోంది. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి అందించిన ట్యూన్స్‌కు , మంగ్లీ వాయిస్ జతకలవడంతో పాటకు మంచి ఆదరణ వచ్చింది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.