Salaar 2 | బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్ (Prabhas)కు మళ్లీ సలార్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో పడ్డ విషయం తెలిసిందే. చాలా కాలానికి హిట్టు పడటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇప్పుడు అభిమానులు, మూవీ లవర్స్ ఫోకస్ అంతా సలార్ పార్టు 2 (Salaar 2)పైనే ఉంది. సీక్వెల్ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సలార్‌లో కీలకపాత్రలో నటించిన పాపులర్ యాక్టర్ బాబీ సింహా సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ అందించాడు. సీక్వెల్ ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్తుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని చెప్పాడు. బాబీ సింహా చెప్పిన వార్తతో థ్రిల్ అవుతున్నారు ఫ్యా్న్స్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. త్వరలోనే సలార్ 2 షూటింగ్ షురూ అవడం ఖాయమైనట్టేనని తెలియడంతో ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు అభిమానులు.