Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
BJP Leader Kirit Somaiya | చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ (CJP)తో పాటు పలు పౌర సంఘాలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే.
BJP Leader Kirit Somaiya | చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ (CJP)తో పాటు పలు పౌర సంఘాలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో ఇటీవల జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు, ఆమిర్ ఖాన్ మేనల్లుడు అయిన ఇమ్రాన్ ఖాన్ పాల్గొనడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదానంలో ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నిర్వహించిన ఆందోళనలో ఇమ్రాన్ ఖాన్ తన భాగస్వామి లేఖా వాషింగ్టన్‌తో కలిసి పాల్గొన్నారు.
అయితే ఈ నేపథ్యంలో ఆయన అమెరికా పౌరుడని ఆరోపిస్తూ, మహారాష్ట్రా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య ఇమ్రాన్ ఖాన్‌ను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని ముంబై పోలీసులను డిమాండ్ చేశారు. విదేశీ పౌరుడిగా ఉండి భారత దేశంలో రాజకీయ ఆందోళనలలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని, ఆయన పౌరసత్వ వివరాలపై సమగ్ర విచారణ జరపాలని సోమయ్య పోలీసులను కోరారు.
అయితే ఈ వివాదంపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. తాను ఏ రాజకీయ పార్టీకి లేదా సంస్థకు ప్రతినిధి కాదని, కేవలం ఈ నగరంలో నివసించే సాధారణ పౌరుడిగా, ప్రజల గొంతుకను అణచివేయడాన్ని ప్రశ్నించేందుకే ఇక్కడికి వచ్చానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పోలీసులు ఇమ్రాన్ ఖాన్‌తో పాటు సుమారు 400 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నటుడికి అభిమానుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

