టాలీవుడ్ హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ చేస్తున్న ప్రాజెక్టు బింబిసార (Bimbisara). మగధ రాజ్యాన్ని పాలించిన బింబిసారుని జీవిత కథ నేపథ్యంలో సోషియో ఫాంటసీ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ్ (Vasisth) డైరెక్ట్ చేస్తున్నాడు. మేకర్స్ నేడు విడుదల చేసిన బింబిసార ట్రైలర్ (Bimbisara Trailer)కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు కల్యాణ్ రామ్.
‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ స్థాపించినపుడు తీసిన అతనొక్కడే చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కొత్తవ్యక్తే. పటాస్అ-నిల్ రావిపూడి, 118-గుహన్..ఇలా నా కెరీర్లో ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేశా. ఈ సినిమాను ప్రాంఛైజీగా తీయాలనుకుంటున్నాం. పార్టు 2 ఇప్పటికేప్లాన్ చేస్తున్నాం. దీనికి పార్టు 3, పార్టు 4 కూడా ఉంటుందని’ అదిరిపోయే అప్ డేట్ అందించాడు కల్యాణ్ రామ్.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా..చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు.