Bimbisara Collections | రెండో రోజు తగ్గేదేలే..బింబిసార కలెక్షన్లు ఇవే..!
వశిష్ఠ్ (Vasistha) దర్శకత్వం వహించిన బింబిసార (Bimbisara) చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్అవుతోంది. కలెక్షన్ల పరంగా కూడా రోజురోజుకూ మెరుగైన ఫలితాలు రాబడుతుంది బింబిసార.
నందమూరి హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషించిన చిత్రం బింబిసార (Bimbisara). వశిష్ఠ్ (Vasistha) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్అవుతోంది. కలెక్షన్ల పరంగా కూడా రోజురోజుకూ మెరుగైన ఫలితాలు రాబడుతుంది బింబిసార. రెండో రోజు కూడా మంచి వసూలు రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తాజా అప్ డేట్ ప్రకారం నైజాం ఏరియాలో రూ.1.77 కోట్లు (జీఎస్టీ సహా) రాబట్టినట్టు టాక్. బింబిసార రెండో రోజు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాంతాల వారీగా..
వైజాగ్-రూ.65 లక్షలు
సీడెడ్-రూ.95 లక్షలు
కృష్ణా-రూ.25 లక్షలు
గుంటూరు-రూ.32 లక్షలు
నెల్లూరు-రూ.11 లక్షలు
ఈస్ట్-రూ.27 లక్షలు
వెస్ట్-రూ.18లక్షలు
తెలంగాణ, ఏపీలో..
తెలంగాణ, ఏపీలో రూ.4.5 కోట్ల షేర్ రాబట్టగా..దీంతో కలిపి మొత్తం కలెక్షన్లు రూ.10.8 కోట్లను క్రాస్ చేసింది బింబిసార. తెలుగు రాష్ట్రాల్లో బింబిసార డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ.13 కోట్లకు అమ్ముడయినట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మూడో రోజు కూడా కలెక్షన్లు ఇలాగే ఉంటే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో బింబిసార బ్రేక్ ఈవెన్ మార్కును అందుకునే అవకాశముందని ట్రేడ్ పండితుల అంచనా.
మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్.
బింబిసారలో వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, వరీనా హుస్సేన్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ, హర్ష చెముడు ఇతర కీ రోల్స్ పోషించారు. ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

