Bimbisara-2 | బింబిసార-2 మొదలయ్యేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్‌రామ్..!
చాలా కాలం తర్వాత ‘బింబిసార’తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. గతేడాది ఆగస్టు నెలలో ఈ సినిమా మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టించింది.
Bimbisara-2 Movie | చాలా కాలం తర్వాత ‘బింబిసార’తో కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. గతేడాది ఆగస్టు నెలలో ఈ సినిమా మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ సునామీని సృష్టించింది. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని కాసుల వర్షాన్ని కురపించింది. ఫైనల్ రన్లో దాదాపు రూ. 65 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకు ప్రీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ను కళ్యాణ్‌రామ్ వెల్లడించాడు.
బింబిసార-2 షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామని కళ్యాణ్‌రామ్ తెలిపాడు. ఈ వార్తతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. సెకండ్ పార్ట్‌లో అసలు బింబిసారుడు ఎవరు. తను తన తమ్ముడుని ఎందుకు చంపాలి అనుకున్నాడు. బింబిసార విలన్‌గా మారడానికి కారణం ఏంటి. తన జీవితం చిన్నపటి నుండి ఎలా సాగింది అనేది కథాంశతో ఈ ప్రీక్వెల్ రూపొందనుందట. ఈ సారి మరింత గ్రాండ్‌గా విజువల్ వండర్‌గా తెరకెక్కించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఈ సారి పాన్ ఇండియా స్కేల్లో సినిమానూ రూపొందించనున్నారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

