Raviteja | యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Raviteja) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ‘వార్2’ తో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ‘వార్’కు సీక్వెల్గా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బాటలోనే మాస్ మహారాజా రవితేజ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమౌతున్నారు.
ఇటివలే ‘టైగర్ నాగేశ్వరరావు’ పాన్ ఇండియా సినిమా చేశారు రవితేజ. అయితే ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు రవితేజ. హిందీ వెర్షన్ కు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. అయితే ఈ కష్టం వృధా పోలేదు. ఇప్పుడు రవితేజకు బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడో భారీ మల్టీస్టారర్ (Multistarrer) లో నటించే ఆఫర్ రవితేజని వెతుక్కుంటూ వచ్చింది.
ఓ అగ్ర నిర్మాణ సంస్థ రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ చేయడానికి రవితేజ సుముఖంగా వున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఒక అధికారక ప్రకటన రానుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమౌతున్నారు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.