బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది. దాదాపు 60 రోజులకి చేరుకుంది. సెప్టెంబర్ 5న 19 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన ఈ షోలో ఇప్పుడు11 మంది మిగిలారు. తొలి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదోవారం హమీదా, ఆరోవారం శ్వేతా వర్మ, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన ఉమాదేవి, ప్రియ, శ్వేతా, సరయు, హమీదా .. నటరాజ్ మాస్టర్ ఇంట్లో కలిసి నట్టు తాజగా చక్కర్లు కొడుతున్న ఫొటోలని చూస్తుంటే అర్ధమవుతుంది. వీరిని ఇలా చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.గతంలోను బిగ్ బాస్ హౌజ్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ సరదాగా కలుసుకోవడం, అప్పుడప్పుడు ఫన్‌కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేయడం వంటివి చేశారు.