Munawar Faruqui | బాలీవుడ్ బిగ్‌బాస్ 17 విజేత స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని బోరా బజార్లో ఉన్న ఓ హుక్కా పార్లర్‌పై ముంబై పోలీసులు మంగళవారం రాత్రి రైడ్ చేయగా.. ఈ రైడ్‌లో హుక్కా తాగుతున్నట్లు గుర్తించిన 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ 14 మందిలో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ కూడా ఉన్నారని బుధవారం ఒక అధికారి తెలిపారు. హెర్బల్ హుక్కా ముసుగులో పొగాకు ఆధారిత హుక్కా వాడుతున్నారన్న సమాచారం రావడంతో రైడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఫరూఖీపై ‘కోప్టా’ 2003 చట్టం కింద కేసు నమోదు చేసిన తర్వాత అతడిని విడిచిపెట్టారు.