Bigg Boss Telugu 7 | గ్రాండ్‌గా మొదలైన బిగ్‌బాస్-7.. హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే..
Bigg Boss Telugu 7 | ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో ఇప్పుడు మరో సీజన్‌కు తెరలేపింది. ఏడో సీజన్‌ను ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలుపెట్టింది. గత రెండు, మూడు సీజన్ల నుంచి బిగ్‌బాస్ షోపై జనాల్లో ఆసక్తి తగ్గిపోతుండటంతో.. ఈసారి నిర్వాహకులు వినూత్నంగా ప్రచారం చేశారు.
Bigg Boss Telugu 7 | ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో ఇప్పుడు మరో సీజన్‌కు తెరలేపింది. ఏడో సీజన్‌ను ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా మొదలుపెట్టింది. గత రెండు, మూడు సీజన్ల నుంచి బిగ్‌బాస్ షోపై జనాల్లో ఆసక్తి తగ్గిపోతుండటంతో.. ఈసారి నిర్వాహకులు వినూత్నంగా ప్రచారం చేశారు. ఏడో సీజన్లో అన్నీ ఉల్టా పల్టా అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ షో ప్రారంభం కావడంతో ముందుగా హోస్ట్ నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి అక్కడి విశేషాలు పంచుకున్నారు. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా స్టేజిపైకి పిలిచి పరిచయం చేశారు.
ఈసారి వినూత్నంగా..
హౌస్‌లోకి వెళ్లిన తర్వాత కంటెస్టెంట్లకు పరీక్షలు పెట్టే బిగ్‌బాస్.. ఈసారి ఏడో సీజన్ ప్రారంభోత్సవ వేదికపైనే సవాళ్లు మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలో బ్రీఫ్‌కేస్‌లో రూ.20 లక్షల క్యాష్ పెట్టి.. సీజన్ నుంచి వెళ్లిపోవాలనుకునేవాళ్లు డబ్బు తీసుకుని వెళ్లిపోవచ్చని మొదటి కంటెస్టెంట్‌ను నాగార్జున ప్రలోభపెట్టాడు. అలా ఒక్కో కంటెస్టెంట్ వచ్చినా కొద్ది రూ.5 లక్షల పెంచుకుంటూ మొదటి ఐదుగురు కంటెస్టెంట్లకు ఆశ చూపించారు. కానీ ఎవరూ మనసు మార్చుకోకుండా హౌస్ లోపలికి వెళ్లిపోయారు.
-
03 Sep 2023 10:31 PM (IST)
14వ కంటెస్టెంట్‌గా అమరదీప్
బిగ్‌బాస్ హౌజ్‌లోకి 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అమరదీప్ చౌదరి తెలుగబ్బాయే. పలు సినిమాలు, సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. విదేశాల్లో చదువుకున్న అమరదీప్.. సినిమాలపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. పలు సీరియల్స్‌లోనూ నటించాడు. వాటిలో వచ్చిన గుర్తింపుతో రాజుగారి కిడ్నాప్, అభిలాష, ఐరావతం, ప్రేమదేశం వంటి సినిమాల్లోనూ నటించాడు.
బిగ్‌బాస్ ఐదో సీజన్లోనే అమరదీప్ ఎక్కువగా పాపులర్ అయ్యాడు. అప్పుడు మానస్‌కు సపోర్ట్ చేసేందుకు బిగ్ బాస్ స్టేజి మీదకు వచ్చాడు. అక్కడ తన మాటలు, ప్రవర్తనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
The anticipation is over as #Amardeepchowdary makes his grand entrance into the Bigg Boss house! 🏠 Get ready for a season filled with his unique charm, wit, and unforgettable moments. Join us on Amardeep's exciting journey! 🎉 #AmardeepOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/9wzoYzmkXs
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 10:07 PM (IST)
13వ కంటెస్టెంట్‌గా యువరైతు
యువ రైతు, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి వస్తాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ 13వ కంటెస్టెంట్‌గా పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ యువ రైతతు. వ్యవసాయంపై అతను చేసే వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్‌కు 2.53 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
Get ready for the enchanting entrance of #pallaviprashanth into the Bigg Boss house! Brace yourself for a season filled with her charm, wit, and unforgettable moments. Join us on Pallavi Prashant's captivating journey!🎉 #PallaviPrashanthOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/edj7jmu4TS
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 10:00 PM (IST)
12వ కంటెస్టెంట్‌గా కిరణ్ రాథోడ్
బిగ్‌బాస్ హౌజ్‌లోకి 12వ కంటెస్టెంట్‌గా ప్రముఖ నటి కిరణ్ రాథోడ్ ఎంట్రీ ఇచ్చింది. కిరణ్ రాథోడ్ పలు దక్షిణాది చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. విక్రమ్ నటించిన జెమిని సినిమాతో ఈమె కోలీవుడ్లోకి అడుగుపెట్టింది. అందులో మనీషా క్యారెక్టర్‌తో మంచి పేరు తెచ్చుకుంది. ఆ వెంటనే అజిత్ హీరోగా వచ్చిన విలన్, కమల్ హాసన్‌తో అన్బే శివం (సత్యం శివం) సినిమాలతో పాపులర్ అయ్యింది. తెలుగులోనూ నువ్వు లేక నేను లేను, అందరూ దొంగలే, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, హైస్కూల్, కెవ్వు కేక వంటి సినిమాల్లో నటించింది. కానీ అవేవీ ఆమెకు క్రేజ్ తీసుకురాలేదు. దీంతో చాలా ఏండ్లుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా ఏండ్ల గ్యాప్ తర్వాత విజయ్ హీరోగా వస్తున్న లియో సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
🌟 It's time for a dazzling entrance as @KiranRathoreOf1 steps into the Bigg Boss house! 🏠 Get ready for a season filled with her charisma, wit, and unforgettable moments. Join us on Kiran Rathore's captivating journey! 🎉 #KiranRathoreOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/QxOQ6dmLuR
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 09:50 PM (IST)
11వ కంటెస్టెంట్‌గా డాక్టర్‌బాబు
11వ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి డాక్టర్ గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్‌కు చిన్నతనం నుంచి రైటర్, డైరెక్టర్ కావాలని కలలు కనేవాడు. ఇదే విషయం పేరెంట్స్‌కు చెబితే ఒప్పుకోలేదు. దీంతో చదువుపై ఫోకస్ పెట్టి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు తన కలలు నెరవేర్చుకునేందుకు సినీ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆకాశవీధుల్లో సినిమాలో మెయిన్ రోల్లో కూడా నటించాడు.
🌟Prepare for a stellar entrance as @igauthamkrishna steps into the Bigg Boss house! 🏠 Get ready for a season filled with his charm, wit, and unforgettable moments. Join us on Goutham Krishna's extraordinary journey! 🎉 #GouthamKrishnaOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/7OWJZbIS1z
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 09:35 PM (IST)
సమంత ఎక్కడా? విజయ్ దేవరకొండను అడిగిన విజయ్ దేవరకొండ
ఖుషి సినిమా ప్రమోషన్లో భాగంగా నటుడు విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ స్టేజి మీదకు స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. హోస్ట్ నాగార్జునతో సరదాగా చిట్ చాట్ చేశాడు. ఈ క్రమంలోనే సమంత ఎక్కడా అని విజయ్ దేవరకొండను నాగ్ ప్రశ్నించాడు. అందుకు సామ్ అమెరికాలో ఉందని.. త్వరలోనే తిరిగొస్తుందని రౌడీ హీరో సమాధానమిచ్చాడు. అక్కినేని కోడలుగా అడుగుపెట్టిన తర్వాత సమంతకు నాగార్జునతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు కూడా. సమంతపై నాగ్ చాలా అభిమానం చూపించేవాడు. కానీ నాగచైతన్యతో విడాకుల తర్వాత అక్కినేని కుటుంబంతో సమంతకు దూరం పెరిగింది. అప్పట్నుంచి సమంత గురించి నాగార్జున ఎక్కడా మాట్లాడలేదు. అలాంటిది బిగ్‌బాస్ స్టేజిపై నాగ్ సమంత గురించి మాట్లాడటం ఇప్పుడు వైరల్‌గా మారింది.
-
03 Sep 2023 09:20 PM (IST)
పదో కంటెస్టెంట్‌గా అచ్చతెలుగు ఆడపడచు
పదో కంటెస్టెంట్‌గా రతిక రోజ్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రతిక అచ్చ తెలుగమ్మాయి. మోడలింగ్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రతిక పలు సినిమాల్లో నటించింది. బొమ్మ అదిరింది దిమ్మతిరిగింది సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్గా నేను స్టూడెంట్ సర్ చిత్రంలో పోలీసాఫీసర్‌గానూ మెప్పించింది. కానీ అవేవీ ఆమెను బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఆమెకు కావాల్సిన ఫేమ్ తీసుకొస్తుందని ఆశపడుతుంది.
🌟 The stage is set for #rathikarose's grand entrance into the Bigg Boss house! 🏠 Get ready for a season filled with her charisma, wit, and unforgettable moments. Join us on Rathika's thrilling journey! 🎉 #RathikaOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/pmOUZJsZWm
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 09:05 PM (IST)
తొమ్మిదో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ నటుడు
ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన టేస్టీ తేజ తొమ్మిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. గతంలో ఇతను జబర్దస్త్ కామెడీ షోలో పలు స్కిట్స్‌లో నవ్వించాడు. ఆ తర్వాత యూట్యూబర్‌గానే ఫుల్ బిజీ అయిపోయాడు. తరచూ సెలబ్రెటీలను కలుస్తూ వాళ్లతో కలిసి మంచి మంచి ఫుడ్ వీడియోలను పెడుతుంటాడు.
🌟 Get ready for a flavor-packed entrance as #tastyteja joins the Bigg Boss house! 🏠 Brace yourself for a season filled with his unique taste, wit, and unforgettable moments. Let's savor Tasty Teja's exciting journey! 🎉 #TastyTejaOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/Z7oM0sK8Qj
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 08:50 PM (IST)
ఎనిమిదో కంటెస్టెంట్‌గా కార్తీక దీపం మోనిత
కార్తీక దీపం సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు ఎంతగా ఫేమస్ అయ్యారో.. అంతేస్థాయిలో మోనిత క్యారెక్టర్‌కు కూడా పేరొచ్చింది. వంటలక్కను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ.. డాక్టర్ బాబుకు దగ్గర కాకుండా కుట్రలు పన్నే క్యారెక్టర్లో శోభా శెట్టి జీవించేసింది. అందుకే ఆమెను శోభాశెట్టి అన్నదానికంటే కూడా మోనితగానే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ బుల్లితెర నటి ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.
🌟 The spotlight is on as @Shobhashetty__ makes her grand entrance into the Bigg Boss house! 🏠 Get ready for a season filled with her charm, wit, and unforgettable moments. Join us on Shoba Shetty's captivating journey! 🎉 #ShobaShettyOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/jxGUvYz8oG
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 08:45 PM (IST)
ఏడో కంటెస్టెంట్‌గా ఆట సందీప్
బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చాడు. కొరియోగ్రాఫర్, డ్యానర్స్‌గా ఆట సందీప్ పాపులర్ అయ్యాడు. డ్యాన్స్ రియాలిటీ షో ఆట మొదటి సీజన్లో విజేతగా నిలిచి.. ఆ షో పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. అన్నట్టు ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్సరే.
🌟Get ready for the electrifying entry of @SandeepAata into the Bigg Boss house! 🏠 Brace yourself for a season filled with his unique charisma, wit, and unforgettable moments. It's time to follow Sandeep's thrilling journey! 🎉 #SandeepOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/y3Q81bnZ4J
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 08:40 PM (IST)
ఆరో కంటెస్టెంట్‌గా షకీలా
ఆరో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన షకీలా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ క్యారెక్టర్స్‌తో మలయాళంలో పాపులారిటీ తెచ్చుకున్న షకీలా.. ఆ తర్వాత కామెడీ పాత్రల్లోనూ అలరించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన షకీలా.. ఇక్కడ పలు కామెడీ రోల్స్‌లో మెప్పించింది. ఇప్పటికే ఈమె కన్నడ బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లి 27 రోజులకే బయటకొచ్చింది.
🌟 It's time for the much-awaited entrance of #Shakila into the Bigg Boss house! 🏠 Get ready for a season filled with her captivating presence, wit, and unforgettable moments. Let's embark on Shakila's exciting journey! 🎉 #ShakilaOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/UdZxEYGHYB
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 08:30 PM (IST)
ఐదో కంటెస్టెంట్‌గా లాయర్
ఐదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన శుభశ్రీ రాయగురు ప్రొఫెషనల్ లాయర్. కానీ కాలేజీ రోజుల నుంచి మోడలింగ్‌పై ఆసక్తి ఉండటంతో అటువైపుగా ప్రయత్నాలు చేసింది. వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 కిరీటం కూడా దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాల్లోనూ ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్లో ఓ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసింది. 2022లో వచ్చిన రుద్రవీణ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఒడిశాలో పుట్టి పెరిగినప్పటికీ.. ఈమె ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటోంది.
🌟 Get ready for the grand entrance of #subhashree the Bigg Boss house! 🏠 Brace yourself for a season filled with her unique charisma, wit, and unforgettable moments. Let's embark on Subhashree's exciting journey! 🎉 #SubhashreeOnBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/hfHYzTxRVG
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 08:14 PM (IST)
నాలుగో కంటెస్టెంట్‌గా బాడీ బిల్డర్
బిగ్‌బాస్ సీజన్ 7లో నాలుగో కంటెస్టెంట్‌గా మోడల్, బాడీబిల్డర్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ప్రిన్స్.. ఇప్పటికే మోడలింగ్‌లో సత్తా చాటాడు. తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించాడు. కానీ అంతగా గుర్తింపుతెచ్చుకోలేదు. అయితే బిగ్‌బాస్ ఆఫర్‌తో అయినా పాపులారిటీ వస్తుందేమోనని ప్రిన్స్ ఆశపడుతున్నాడు.
Get ready for the grand entrance of @princeyawar into the Bigg Boss house! 🏠 Brace yourself for a season filled with his regal charisma, wit, and unforgettable moments. Let's embark on Prince Yawar's royal journey! 🎉 #PrinceYawarInBBTelugu7 @iamnagarjuna @DisneyPlusHSTel pic.twitter.com/HgECP0FnjB
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 08:00 PM (IST)
మూడో కంటెస్టెంట్‌గా దామిని భట్ల
సీజన్ 7లో మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని భట్ల ఎంట్రీ ఇచ్చింది. బాహుబలిలో పచ్చబొట్టేసిన పాటతో పాపులారిటీ తెచ్చుకుంది దామిని. ఆమె స్వస్థలం రాజమండ్రి. 2011లో పాడుతా తీయగా ప్రొగ్రామ్‌లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆమెకు సినిమాల్లోనూ పాడే అవకాశాలు వచ్చాయి.
Brace yourselves for the grand entrance of @daminibhatlach into the Bigg Boss house! 🏠 Get ready for a season packed with her charm, wit, and unforgettable moments. It's time to embark on Damini's exciting journey! 🎉 #DaminiInBBTelugu7 @DisneyPlusHSTel @iamnagarjuna pic.twitter.com/PtNnAOihmp
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 07:40 PM (IST)
శివాజీ ఎంట్రీ
ఏడో సీజన్లో రెండో కంటెస్టెంట్‌గా సినీ హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. సైడ్ క్యారెక్టర్ల నుంచి హీరో స్థాయి వరకు ఎదిగిన శివాజీ.. మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, టాటా బిర్లా మధ్యలో లైలా, మిస్సమ్మ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యాడు. 2016లో వచ్చిన సీసా సినిమాతో సిల్వర్ స్క్రీన్కు దూరమయ్యాడు. చివరిసారిగా గ్యాంగ్స్టర్స్ అనే వెబ్‌సిరీస్‌లో కనిపించాడు.
The moment we've all been waiting for is here! 🏠 Get ready to welcome #Sivaji with open arms into the Bigg Boss house. Brace yourself for a season filled with his charisma, wit, and unforgettable moments. Let the journey begin! 🎉 #SivajiInBBTelugu7 pic.twitter.com/zxjWwqsMc1
— Starmaa (@StarMaa) September 3, 2023
-
03 Sep 2023 07:30 PM (IST)
తొలి కంటెస్టెంట్‌గా ప్రియాంక జైన్
మౌనరాగం సీరియల్‌తో పాపులర్ అయిన నటి ప్రియాంక జైన్ ఏడో సీజన్లో తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. కర్ణాటకలో జన్మించిన ప్రియాంక జైన్ బెంగళూరులో విద్యాభ్యాసం పూర్త చేసుకుంది. 2015లో రంగి తరంగ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వినరా సోదర వీర కుమార, ఛల్తే, ఛల్తే, ఎవడూ తక్కువ కాదు వంటి సినిమాల్లోనూ నటించి హీరోయిన్గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అవేవీ సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై సెటిల్ అయ్యింది. మౌనరాగం, జానకి కలకనలేదు వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
The stunning @priyankajain7 is all set to make a grand entrance into the Bigg Boss Telugu 7 house! Get ready for fireworks and drama as she steps in. Are you excited to see her journey unfold? 🔥🏠 #BiggBossTelugu7 #PriyankaEntry pic.twitter.com/xZD6JfKXsx
— Starmaa (@StarMaa) September 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

