Bigg Boss Telugu 7 | బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్.. నెట్టింట కంటెస్టంట్స్ పేర్లు చక్కర్లు..!
Bigg Boss Telugu 7 | కొన్ని రోజుల క్రితం మేకర్స్ బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu తెలుగు సీజన్ 7 లోగోను (Bigg Boss Telugu 7) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసే వాళ్లలో ఎవరెవరుండబోతున్నారని ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
Bigg Boss Telugu 7 | సూపర్ పాపులారిటీ ఉన్న తెలుగు టీవీ రియాలిటీ షోల్లో టాప్‌లో ఉంటుంది బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu). కొత్త కొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్, కాంట్రవర్సీస్, వినోదాలతో సాగుతూ అందరినీ టీవీలకు కట్టిపడే ఈ షో కొత్త సీజన్ వచ్చేస్తున్న విషయం తెలిసిందే. గెట్ రెడీ అంటూ ఇప్పటికే మేకర్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోగోను (Bigg Boss Telugu 7) విడుదల చేశారు.
ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసే వాళ్లలో ఎవరెవరుండబోతున్నారని ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. తాజాగా కొన్ని పేర్లు చక్కర్లు కొడుతుండగా..సింగర్ మోహన బోగరాజు, ఈటీవీ ప్రభాకర్, యాంకర్ నిఖిల్, కొరియోగ్రఫర్ ఢీ పండుతోపాటు పాపులర్ టిక్‌టాక్ కపుల్ దుర్గారావ్-సతీమణి సహా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి వీరంతా సీజన్ 7లో కనిపిస్తారా..? లేదా..? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 7 షో సెప్టెంబర్ తొలి వారంలో Star Maa, Disney + Hotstarలో ప్రసారం కానుంది.
Bigg Boss Telugu 7తో మరపురాని సాహసం చేసేందుకు రెడీగా ఉండండి. ఎక్జయిటింగ్ కౌంట్‌డౌన్ షురూ.. అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున, నాని సీజన్ల వారిగా హోస్టులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. మరి ఈ సారి ఎవరు బిగ్ బాస్ సీజన్ 7కు హోస్ట్‌గా కనిపించబోతున్నారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఇక మరికొన్ని రోజులు ఆగితే కొత్త కంటెస్టంట్స్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోగో గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

