Bigg boss: ఇక్కడ టన్నుల కొద్ది కిక్ వస్తుంది.. బిగ్ బాస్ ప్రోమో విడుదల

బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్‌కి సిద్ధమైంది. నేటి నుండి ఐదో సీజన్ ప్రసారం కానుండగా, ఇన్నాళ్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన వస్తున్న వార్తలకు ఈ రోజుతో బ్రేక్ పడనుంది. ఈ రోజు సాయంత్రం 6గం.లకు లాంచింగ్ కార్యక్రమం ప్రసారం కానుండగా, దీనికి సంబంధించిన షూట్ నిన్ననే పూర్తైంది.
తాజాగా మేకర్స్ సీజన్ 5కి సంబంధించి కొత్త ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోతో రచ్చ ఐదింతలు ఉంటుందని చెప్తున్నారు. ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలానే కిక్ ఈసారి టన్నుల్లో ఉంటుందని చెప్పడంతో అంచనాలు భారీగా పెరిగాయి. బయట నుండి బిగ్ బాస్ హౌజ్ కూడా చూపించి ఆసక్తి రేకెత్తించారు. మరి కొద్దిగంటలలో ప్రసారం కానున్న సీజన్ 5 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
The BIGG day is here! Get ready for 5-much entertainment…Ikkada kick tonnullo vastundi 👁️ #BiggBossTelugu5 starting today at 6 PM on #StarMaa pic.twitter.com/HasK9Xwn7F
— Starmaa (@StarMaa) September 5, 2021
బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ లిస్ట్ అంటూ కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో 1. యాంకర్ రవి, 2. యాంకర్ వర్షిణి, 3. యాక్టర్ ప్రియ 4. వర్ధమాన నటి లహరి షారి 5. జబర్ధస్త్ ప్రియాంక 6. సిరి హన్మంతు 7. సింగర్ రామచంద్ర 8. సెవెన్ ఆర్ట్స్ సరయు 9 దీపక్ సరోజ్ 10. వర్థమాన నటి శ్వేతా వర్మ 11 షణ్ముఖ్ జస్వంత్ 12 నటరాజ్ మాస్టర్ 13. టెలివిజన్ యాక్టర్ సన్నీ 14 టెలివిజన్ నటుడు మానస్ షా 15 టెలివిజన్ నటి ఉమాదేవి (కార్తీకదీపం ఫేమ్) 16 మోడల్ జస్వంత్ 17 ఆర్జే కాజల్ 18 యూట్యూబర్ లోబో 19 లహరి షారి ఉన్నారు. ఇందులో ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో మరి కొద్ది గంటలలో తేలనుంది.
ఇది కూడా చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

