Bigg Boss | బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ ఫ్లేమ్ టూర్ షురూ.. విజయనగరంలో కళ్యాణ్ పడాల, విశాఖలో డెమాన్ పవన్ రచ్చ!
BiggBoss Agni Pareeksha 2 | తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మరో సరికొత్త జోరుకు సిద్ధమైంది. ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు మరియు ‘అగ్ని పరీక్ష’ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు నిర్వహಿಸುತ್ತಿರುವ ‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
BiggBoss Agni Pareeksha 2 | తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మరో సరికొత్త జోరుకు సిద్ధమైంది. ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు మరియు ‘అగ్ని పరీక్ష’ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు నిర్వహಿಸುತ್ತಿರುವ ‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ టూర్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారగా, తొలి విడతలో భాగంగా విజయనగరం, విశాఖపట్నం నగరాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు అభిమానుల నుంచి అపూర్వ స్పందన లభించింది.
ఈ టూర్‌కు సంబంధించి తొలి అడుగు విజయనగరం గడ్డపై పడింది. బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష’ వేదికగా హౌస్‌లోకి అడుగుపెట్టి, తన అద్భుతమైన ఆటతీరు, క్రమశిక్షణ, పట్టుదలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుని చివరకు ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ విజేతగా చరిత్ర సృష్టించిన కళ్యాణ్ పడాల ఈ ఫ్లేమ్ టూర్‌ను విజయనగరంలో ఘనంగా ప్రారంభించారు. సొంత గడ్డపై ఘనస్వాగతం అందుకున్న కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ అభిమాన హీరోతో సెల్ఫీలు దిగేందుకు, ఫొటోలు తీసుకునేందుకు యువత పోటీ పడింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన కళ్యాణ్ పడాల భావోద్వేగానికి గురయ్యారు. విజయనగరం ప్రజలు, తన అభిమానులు అందించిన ప్రేమాభిమానాలే తనను ఈ స్థాయికి చేర్చాయని, ఆ మద్దతును జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. విజయనగరం వీధుల్లో సాగిన ఈ ఫ్లేమ్ టూర్ అభిమానుల కేరింతలు, కోలాహలంతో పండుగ వాతావరణాన్ని తలపించింది.
విజయనగరం విజయవంతమైన యాత్ర తర్వాత ఈ ఫ్లేమ్ టూర్ ఉత్సాహంగా వైజాగ్ (విశాఖపట్నం) నగరానికి చేరుకుంది. సిటీ ఆఫ్ డెస్టినీలో బిగ్ బాస్ 9 ఫైనలిస్ట్ డెమాన్ పవన్ సందడి చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. విశాఖలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న డెమాన్ పవన్ యువతను ఉద్దేశించి ఒక శక్తివంతమైన, ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ‘అగ్ని పరీక్ష’ అనేది కేవలం ఒక సాధారణ వేదిక కాదని, బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాలనే ప్రతి ఒక్కరి కలను నిజం చేసే బలమైన వారధి అని ఆయన అభివర్ణించారు. అగ్ని పరీక్ష అంటే కేవలం ఆటలు, టాస్కులు మాత్రమే కావని, అది మన నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాల్‌ను, ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనేలా మనలో ఆత్మస్థైర్యాన్ని నింపే వేదిక అని ఆయన కొనియాడారు. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనే కసిని, మనలోని నిజమైన ఫైర్‌ను ఎప్పుడూ సజీవంగా ఉంచే అద్భుతమైన అవకాశం ఇదని పవన్ స్పష్టం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు, ముఖ్యంగా యువతలో సరికొత్త జోష్ నింపే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ఫ్లేమ్ టూర్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే ఆగస్ట్ 15 నుంచి ‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2’ అధికారికంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ టూర్ ద్వారా షోపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ లాంటి యువ సంచలనాలు ఈ టూర్లో పాలుపంచుకోవడం షోపై మరింత క్రేజ్‌ను పెంచేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో ‘ది ప్యారడైజ్’.. ఏకంగా 24 నిమిషాల సీన్లు కట్, నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త వెర్షన్!
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

