Bigg Boss 9 | మూడో వారం ఎలిమినేషన్ డ్రామా.. సంజనాకి మరో ఛాన్స్, ప్రియ శెట్టి ఔట్!
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారంలో హైడ్రామా, ట్విస్టులతో ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ అనూహ్యంగా ప్లాన్ చేసి, హౌజ్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకి కూడా షాక్ ఇచ్చాడు.
Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మూడో వారంలో హైడ్రామా, ట్విస్టులతో ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ అనూహ్యంగా ప్లాన్ చేసి, హౌజ్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులకి కూడా షాక్ ఇచ్చాడు. సంజనాను మిడ్ వీక్‌లో ఎలిమినేట్ చేసినట్టు ప్రకటించి, ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపడం, అనంతరం శనివారం ఎపిసోడ్లో స్టేజ్ మీదకు తీసుకొచ్చి గుడ్ బై చెప్పించడం ఎపిసోడ్‌కి బిగ్గెస్ట్ ట్విస్ట్లుగా మారాయి. అయితే అదే సమయంలో నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తున్నట్టు ప్రకటిస్తూ, హౌజ్‌లోని నలుగురు కంటెస్టెంట్లు త్యాగాలు చేస్తే సంజనా తిరిగి హౌజ్‌లోకి రావచ్చని చెప్పాడు.
ఈ సందర్భంగా ఇమ్మాన్యుయెల్ కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను త్యాగం చేయగా, తనూజ కాఫీ తాగకుండా ఉండేందుకు అంగీకరించింది. శ్రీజ మాత్రం తన డ్రెస్సుల్ని త్యాగం చేయడానికి ఒప్పుకోలేదు. రీతూ చౌదరీ తన జుట్టును కత్తిరించగా, భరణి తన ప్రియమైన లాకెట్‌ను త్యాగం చేయడం విశేషం. దీంతో సంజనాకు హౌజ్‌లోకి తిరిగొచ్చే అవకాశం కలిగింది. ఇదిలా ఉంటే, హౌజ్‌లో నడుస్తున్న వ్యూహాలు, తప్పుడు వ్యాఖ్యలపై నాగార్జున క్లాస్ పీకాడు. హరీష్ చేసిన “లత్కోర్ పనులు” వ్యాఖ్యపై కఠినంగా స్పందిస్తూ, అలాంటి పదాలు హౌజ్‌లో వాడకూడదని హెచ్చరించాడు. శ్రీజ కెప్టెన్సీ టాస్క్‌లో చేసిన తప్పులను ఫుల్ వీడియో చూపించి ప్రశ్నించాడు. రీతూ చౌదరి ప్రతిదానికీ ఏడుస్తుందని నిలదీయగా, కళ్యాణ్‌ను గేమ్‌లో పాల్గొనాలని గట్టిగా చెప్పారు.
ఈ వారం నామినేషన్లో హరీష్, ఫ్లోరా, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, ప్రియాలు, రీతూ చౌదరి ఉన్నారు. అయితే తక్కువ ఓట్లతో ప్రియ శెట్టి ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఆమె హౌజ్ నుండి బయటకు వెళ్లడం కన్ఫర్మ్ అయిందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక డబుల్ ఎలిమినేషన్‌ను అందరూ ఊహించినా, బిగ్ బాస్ అందరికీ షాక్ ఇస్తూ, సంజనాకు మరో అవకాశం ఇచ్చి గేమ్‌ను మళ్లీ మలుపు తిప్పాడు. మూడో వారం చివరికి బిగ్ బాస్ షో ఎమోషనల్, స్ట్రాటజికల్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఇక్కడి నుంచి గేమ్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

