Bigg Boss | బిగ్ బాస్ ప్రీ షో కోసం వెయిటింగ్… ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఎన్ని ఎలిమినేషన్స్ జరిగాయంటే..!
Bigg Boss | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ మరికొన్ని రోజుల్లోనే గ్రాండ్ లాంచ్ కానుండగా, దానికి ముందు ప్రత్యేక ప్రీ-షో 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష రూపుదిద్దుకుంటుంది.
Bigg Boss | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ మరికొన్ని రోజుల్లోనే గ్రాండ్ లాంచ్ కానుండగా, దానికి ముందు ప్రత్యేక ప్రీ-షో ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ షో షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 22, 2025 నుంచి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ప్రీ-షో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ షో ప్రతి రోజు ఒక గంట పాటు ప్రసారం అవుతుంది.
ఆగస్ట్ 22 నుండి సెప్టెంబర్ 4 వరకు అంటే సరిగ్గా రెండు వారాల పాటు ఈ ప్రత్యేక ప్రీ-షో నడవనుంది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశించేందుకు 45 మంది కామన్ పీపుల్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు కూడా జరిగిపోయినట్లు సమాచారం. ఈ 45 మందిలో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. అయితే చివరకు ఆరుగురు మాత్రమే తమ టాలెంట్‌తో హౌస్‌లో అడుగుపెట్టనున్నారు.ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా కంటెస్టెంట్ల ఎంపిక జరగలేదు, ఇది పూర్తిగా కొత్త ఫార్మాట్ మాదిరిగా కనిపిస్తుంది.
షోకు ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. న్యాయనిర్ణేతలుగా నవదీప్ , అభిజీత్, బిందు మాధవి వ్యవహరిస్తున్నారు. వీరి జడ్జ్మెంట్ ఆధారంగా ఆ ఆరుగురు ఎవరనేది నిర్ణయించబడుతుంది. ‘అగ్నిపరీక్ష’ ప్రీ-షోతో బిగ్‌బాస్ 9 సీజన్‌కు ఓ వినూత్న ఆరంభం లభించనుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ ఫార్మాట్ ద్వారా అసలైన టాలెంట్‌కు గుర్తింపు దక్కే అవకాశం ఉండటంతో, ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియాలో ఇప్పటికే బిగ్ డిబేట్స్, అంచనాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ‘బిగ్‌బాస్ తెలుగు 9’ అధికారికంగా ప్రారంభం కానుంది. అంతవరకూ ‘అగ్నిపరీక్ష’తో మంత్రముగ్ధులను చేసే ప్రయత్నంలో షో టీం ఉంది. మొత్తానికి ఈసారి బిగ్‌బాస్ మామూలుగా ఉండదని హై వోల్టేజ్ డ్రామా, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో మోత మోగించబోతున్నదనే చెప్పొచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

